ఫ్యాషన్ లేబుల్ మోవలోలా యూనిక్ డిజైన్‌లకు ప్రసిద్ధి చెందింది.ఈ ఫ్యాషన్ లేబుల్ డిజైన్స్ ఒక్కోసారి చూస్తుంటే నవ్వుకోక తప్పదు.
మరోసారి కిందపడి బొర్లి నవ్వేంత వింతగా వీరి డిజైన్లు ఉంటాయి.కాగా ఈ ఫ్యాషన్ బ్రాండ్ ఇటీవల లండన్‌లో డెనిమ్‌లో కొత్త ట్రెండ్‌ను ప్రదర్శించింది.
ఈ ఫ్యాషన్ షోలో మోడల్స్ సాధారణ నడుము లేదా పొట్టకు సరిపోయే జీన్స్‌కు బదులుగా, వారు మోకాలి వరకు జారిపోయే ఒక ప్యాంటును వేసుకొని వాకింగ్ చేశారు.ఇలాంటి విచిత్రమైన ఫ్యాషన్ చూసి అవాక్కవ్వడం అందరివంతయ్యింది.
ఈ జారిపోయే జీన్స్ ప్యాంట్ వేసుకుని ర్యాంప్ వాక్ చేస్తున్న మోడల్స్ వీడియో ఒకటి ట్విట్టర్ లో వైరల్ గా కూడా మారింది.దీన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
ఈ వీడియోకి కూడా ఫన్నీగా క్యాప్షన్ జోడించారు.బాత్‌రూమ్‌కి వెళ్లి ప్యాంటు సగం విప్పేసి అలానే మళ్లీ నడుచుకుంటూ బయటకు వచ్చినట్లు ఉంది వీరి ఫ్యాషన్ అని ఆ వీడియో క్యాప్షన్ రాసి ఉంది.
మొవలోలా ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఇలాంటి సంచలనాలు సృష్టించడం ఇదే మొదటిసారి కాదు.గతంలో, వారు తమ స్ప్రింగ్ సమ్మర్ షోలో ఇతర విచిత్రమైన దుస్తులను ప్రదర్శించారు, అది అందరినీ నివ్వెరపోయేలా చేసింది.లో-వెయిస్ట్ జీన్స్ ట్రెండ్ గతంలో బాగా పాపులర్ అయింది, అయితే మోవాలోలా మోకాలి వరకు జారిపోయే డెనిమ్ జీన్స్‌తో దానిని సరికొత్త లెవెల్‌కి తీసుకువెళ్ళింది.మరి ఈ ట్రెండ్ సామాన్య ప్రజానీకానికి నచ్చుతుందా లేక విపరీతమైన స్టైల్‌గా నిలుస్తుందా అనేది చూడాలి.
నిజానికి ఫ్యాషన్ పోకడలు నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటాయి.డిజైనర్లు కొత్త స్టైల్స్‌తో ప్రయోగాలు చేయడం కామన్.కానీ ఇలా ప్యాంటులు జారిపోయేలా కట్టుకొని తిరగడం లాంటివి చేయడం వల్ల ఒక్కోసారి నవ్వుల పాలవుతారు.