చిరుత కోసం ఏర్పాటు చేసిన బోనులో మనిషి.. ఎలా చిక్కాడంటే..??

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఒక వింత ఘటన వెలుగు చూసింది.రీసెంట్‌గా ఈ ప్రాంతంలో ఓ వ్యక్తి చిరుతపులిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకున్నాడు.

 How Can A Man Get Trapped In A Cage Set Up For A Leopard, Bulandshahr, Uttar Pr-TeluguStop.com

ఆ ప్రాంతంలో చిరుతపులి పాదముద్రలు కనిపించడంతో అటవీశాఖ అధికారులు బోనును ఏర్పాటు చేశారు.చిరుతపులికి ఎరగా బోను లోపల ఒక కోడిని ఉంచారు.

మరుసటి రోజు ఉదయం బోనులో ఏడుస్తూ ఒక వ్యక్తి స్థానికులు కనిపించాడు.దాంతో షాక్ అవడం వారి వంతయ్యింది.

నివేదికల ప్రకారం, ఆ వ్యక్తి కోడిపుంజును పట్టుకోవడానికి ప్రయత్నించాడు, కానీ చివరికి బోనులో చిక్కుకున్నాడు.తర్వాత బోనం నుంచి బయటికి రావాలని ప్రయత్నించాడు.కానీ అతను తనను తాను విడిపించుకోలేకపోయాడు.దాంతో చివరికి అటవీ అధికారులు అతనిని రక్షించవలసి వచ్చింది.బోనులో ఉన్న వ్యక్తి వీడియో వైరల్ కావడంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.చాలామంది బోనాలు అలా ఎలా చిక్కావు బాసూ అంటూ అతడిని హేళన చేస్తున్నారు.

ఇలాంటి వింత ఘటన చూడటం ఇదే తెలుసా అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.

దీనిని మీరు కూడా చూసేయండి.

ఇకపోతే వన్యప్రాణులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరమని ఈ సంఘటన తెలియజేస్తోంది.పులులు, చిరుతలు చాలా వేగంగా దాడి చేస్తాయి.ఇవి ప్రమాదకరమైనవి అని గుర్తుంచుకోవడం ముఖ్యం.

అలాంటివి సంచరించే ప్రాంతంలో కోడి కోసం ఇలా మూర్ఖత్వపు పనులు చేయడం చాలా డేంజర్ అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube