వేసవి కాలం ప్రారంభం అయింది.ఎండలు మండిపోతున్నాయి.
రోజు రోజుకు ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి.ఇక వేసవి వేడి కారణంగా చాలా మంది నీరసం సమస్యతో బాధపడుతుంటారు.
పైగా ఈ నీరసం ఓ పట్టాన వదిలిపెట్టదు.దాంతో నీరసాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక మదన పడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే స్మూతీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.ఈ స్మూతీని తీసుకుంటే ఎలాంటి నీరసం అయినా దెబ్బకు పరార్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.

ముందుగా ఒక మామిడి పండును( Mango ) తీసుకుని వాటర్ తో కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక అరటి పండును తీసుకొని తొక్క తొలగించి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు, అరటి పండు స్లైసెస్( Banana slices ), వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి.

అలాగే ఒకటిన్నర గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు( Almond milk ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన మ్యాంగో బనానా ఆల్మండ్ స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ స్మూతీ చాలా టేస్ట్ గా ఉంటుంది.ప్రస్తుత సమ్మర్ సీజన్ లో ఈ స్మూతీని తీసుకుంటే వేసవి వేడి వల్ల వేధించే నీరసం నుంచి త్వరగా బయటపడతారు.
అలసట దూరం అవుతుంది.ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరం సూపర్ ఎనర్జిటిక్ గా మారుతుంది.

కాబట్టి వేసవి కాలంలో ఎవరైతే నీరసం సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో వారు తప్పకుండా ఈ మ్యాంగో బనానా ఆల్మండ్ స్మూతీని( Banana Almond Smoothie ) తీసుకునేందుకు ప్రయత్నించండి.పైగా ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోవడం వల్ల అతి ఆకలి దూరం అవుతుంది.వెయిట్ లాస్ అవుతారు.బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.ఎముకలు, కండరాలు దృఢంగా సైతం మారతాయి.