బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా అనసూయ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
అయితే అనసూయ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.ఈ విధంగా అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి సౌమ్యరావును యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఈమె తెలుగు అమ్మాయి కాకపోయినాప్పటికీ పలు తెలుగు సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేసేవారు.
ఈ విధంగా బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సౌమ్యరావు వచ్చిరాని తెలుగుతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ జబర్దస్త్ యాంకర్ గా ప్రేక్షకులను సందడి చేస్తూ వచ్చారు.ఇలా జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే కొన్నిసార్లు సౌమ్య తన డాన్స్ వీడియోలపై భారీగా ట్రోలింగ్ కు గురవుతూ ఉంటారు .
ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా తాజాగా ఒక డాన్స్ వీడియోని షేర్ చేశారు.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే కొందరు నెటిజెన్స్ ఈ వీడియో పై స్పందిస్తూ…సౌమ్యరావుకు డాన్సులు సరిగా రావు అంటూ తనని ట్రోల్ చేస్తూ ఒక నెటిజన్ దయచేసి ఇంకోసారి డాన్స్ చేయకు.నీకు దండం పెడతాం అంటూ కామెంట్లు చేశారు.
ఇలా ఈమె చేసిన ఈ డాన్స్ వీడియోకి నేటిజన్ నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.ప్రస్తుతం ఈమె షేర్ చేసినటువంటి ఈ వీడియో వైరల్ గా మారింది.