హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది.దసరా సమయంలో పేలుళ్లకు జావిద్ గ్యాంగ్ కుట్రకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఉగ్ర కుట్రను హైదరాబాద్ సిట్ పోలీసులు భగ్నం చేసి నిందితులను అరెస్ట్ చేశారు.పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో క్రియాశీలకంగా పని చేస్తూ మూసారాంబాగ్ లో నివాసం ఉంటున్న జావిద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదే సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయంతో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ క్రమంలో ముగ్గురిని అరెస్ట్ చేసి ఎన్ఐఏ కేసు నమోదు చేసింది.