భవనం పై నుంచి కింద పడి ఐదేళ్ల భారతీయ చిన్నారి మృతి.. ఏ దేశంలో అంటే..

ఈ మధ్యకాలంలో ఏ దేశంలో చూసినా ఎత్తైన పెద్దపెద్ద భవనాలను నిర్మిస్తూ ఉన్నారు.ఈ పెద్ద పెద్ద ఎత్తైన భవనాలు నిర్మించడానికి కారణం ఈ మధ్యకాలంలో జనాభా పెరిగిపోవడం వల్ల ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు తక్కువైపోతున్నాయి.

 A Five-year-old Indian Child Died After Falling From The Top Of A Building In Wh-TeluguStop.com

అందువల్లే ఈ పెద్ద పెద్ద ఎత్తయిన భవనాలను నిర్మించుకుంటూ అందులోనీ అపార్ట్మెంట్లలో ప్రజలందరూ జీవిస్తున్నారు.ఈ భవనాలపై నుంచి కిందపడి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చనిపోతున్నారు.

ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎన్నో జరుగుతున్నాయి.

తాజాగా దుబాయ్ లోని ఒక ఎత్తైన భవనం పైనుంచి ఐదేళ్ల భారతీయ చిన్నారి క్రిందపడి ప్రాణాలను కోల్పోయేన విషాదమైన ఘటన జరిగింది.

ఈ ఏడాది ఇలాంటి ఘటనలు జరగడం ఇది మూడోసారి డిసెంబర్ 10న దుబాయ్ లోని ధీర జిల్లాలో భవనం లోని 9వ అంతస్తులోని అపార్ట్మెంట్లోని కిటికీలో నుంచి చిన్నారి పడిపోవడంతో ఈ ఘటన జరిగిందని ఖలీజు టైమ్స్ వార్తాపత్రిక డిసెంబర్ 11న ప్రకటనను విడుదల చేసింది.యూఏఈ లో అధికారిక డాక్యుమెంటేషన్ పూర్తి చేసిన తర్వాత చివరి కర్మల కోసం చిన్నారి మృతదేహాన్ని తిరిగి భారతదేశానికి తరలించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం.

విషాదంలో చిక్కుకున్న కుటుంబం వివరాలు మాత్రం ఇప్పటికీ తెలియదు.ఇది ఎలా జరిగిందో తమకు కచ్చితంగా తెలియదని కానీ ఇది హృదయ విదారక ఘటన అని పొరుగున ఉన్న స్థానికులు చెబుతున్నారు.ఆ బాలిక ఎప్పుడూ నవ్వుతూ, చురుకైన అమ్మాయి అని చెబుతున్నారు.గత నెలలో ఆసియా సంతతికి చెందిన మూడేళ్ల చిన్నారి షార్జాలోని ఒక భవనం లోని 14వ అంతస్తు నుంచి పడి చనిపోగా, ఫిబ్రవరి లో 10 ఏళ్ల ఆసియా చిన్నారి షార్జాలోని ఒక పెద్ద భవనంలో 32 వ అంతస్తు నుంచి పడి మృతి చెందింది.

ఈ ఘటనలు ఎలా జరిగాయో అనే దానిపై వివరణ మాత్రం ఇప్పటివరకు ఏ వార్తాపత్రిక కూడా ఇవ్వలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube