నందమూరి బాలకృష్ణ సంక్రాంతి కి వీర సింహారెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.క్రాక్ సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా ఖచ్చితం గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని నమ్మకం తో బాలకృష్ణ అభిమానులు ఉన్నారు.
వీర సింహారెడ్డి సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదని చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.సంక్రాంతి కి మరెన్నో రోజులు లేదు.
అయినా కూడా ఇంకా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేయక పోవడం ఏంటి అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయం లోనే వీర సింహారెడ్డి సినిమా ను పక్కకు పెట్టి తన తదుపరి సినిమా ను మొదటి షెడ్యూల్ పూర్తి చేసేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి బాలకృష్ణ షూటింగ్ చేస్తున్నారట.
విశ్వసనీయంగా అందుకున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమా యొక్క మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత మళ్లీ వీర సింహారెడ్డి సినిమా చివరి షెడ్యూల్ లో బాలకృష్ణ జాయిన్ అవ్వబోతున్నాడు అనేది టాక్.

వీర సింహారెడ్డి సినిమా విడుదల తేదీ ముంచుకొస్తున్న సమయం లో ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేయాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు బాలకృష్ణ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి బాలయ్య బిజీ బిజీ గా సినిమాలు చేస్తున్నాడు.అందుకే ఆయన టాక్ షో అన్ స్టాపబుల్ కొత్త ఎపిసోడ్స్ ఆలస్యం అవుతున్నాయి అనేది టాక్.
భారీ అంచనాల నడుమ రూపొందిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కి పోటీ గా రాబోతున్న విషయం తెలిసిందే.ఈ రెండు సినిమా లు సంక్రాంతి కి బాక్సాఫీస్ వద్ద హోరా హోరీ గా తలబడతాయని అంటున్నారు.