తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో మురుగుదాస్ ఒకరు.ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా బ్లాక్ బస్టర్స్ అందించిన మురుగుదాస్ అందరికి సుపరిచితమే.మరి ఇలాంటి గ్రేట్ ట్రాక్ ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో ఫామ్ కోల్పోయాడు.
విజయ్ హీరోగా తెరకెక్కిన కత్తి సినిమా నుండి ఈయన హిట్ అందుకోలేక పోతున్నాడు.
ఈ సినిమా తర్వాత అకీరా, స్పైడర్, సర్కార్, దర్బార్ వంటి సినిమాలను తెరకెక్కించాడు.
కానీ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.దీంతో ఈయన కెరీర్ వరుస ప్లాపులతో మునిగి పోయాడు.
తనతో ఇప్పుడు సినిమాలు చేయడానికి పెద్ద హీరోలు ఎవ్వరూ కూడా ఆసక్తిగా లేరు.అయితే ఈయన మాత్రం రామ్ చరణ్ తో ఒక భారీ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకు రావాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్న మురుగుదాస్ చేసిన పని వల్ల ఈ సినిమాను చరణ్ రిజక్ట్ చేసాడు.అందుకు కారణం ఏంటంటే.రామ్ చరణ్ తో తెలుగులో మాత్రమే సినిమా చేసి అదే ప్రాజెక్ట్ ను తమిళ్ లో శింబు తో చేస్తానని చెప్పాడట.మరి అలా చేయడానికి చరణ్ ఆసక్తిగా లేరని అందుకే ఈయన రిజక్ట్ చేసారని టాక్.
ఇక ఇదే కథను అల్లు అర్జున్ కు వినిపించిన మురుగుదాస్ కు ఇదే సమాధానం వచ్చిందట.

మరి ప్రెజెంట్ రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా ఇమేజ్ తెచ్చుకున్నారు.మరి అలాంటి హీరోలతో మురుగుదాస్ కేవలం తెలుగులో మాత్రమే సినిమా చేస్తానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.వీరిద్దరూ ప్రెజెంట్ అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కేవలం వీరితో తెలుగులోనే సినిమా చేస్తా అనడం వల్ల ఈయన దృష్టిలో వీరు పాన్ ఇండియా స్టార్స్ కాదా అనే సందేహం స్టార్ట్ అయ్యింది.ఇలా చేయడంపై ఇతడి మీద నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.