తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకోవడంతో ఎవరు విన్నర్ అవుతారనే ఆసక్తి నెలకొంది.ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్ సభ్యులకు సరికొత్త టాస్క్ లు ఇస్తూ వస్తున్నారు.
శనివారం ఎపిసోడ్ చూసిన వారంతా కూడా రేవంత్ ను గెలిపించేందుకు బిగ్ బాస్ ట్రై చేస్తున్నట్లు ఉందన్నట్లు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.వారం మొత్తంలో హౌస్ లో ఏంజరిగాయి.
ఎవరి ఆట తీరు ఎలా ఉంది.తప్పులు ఎవరు చేసారు .ఎవరు కరెక్ట్ గా ఆడారు అనేవి చెప్పే హోస్ట్ నాగార్జున.శనివారం కూడా అలాగే చెప్పుకొచ్చారు.
అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల ఆటతీరును మార్చేలా ఆది రెడ్డి మాట్లాడుతున్నాడని నాగార్జున బాగా విమర్శించాడు.
అంతేకాదు మాట్లాడితే బయటకు వెళ్లిపోతా అంటున్నావు కదా అంటూ వీడియో చూపించాడు.
అందులో ఆదిది తప్పని తేలడంతో బయటకు వెళ్లిపోతావా అని ప్రశ్నించాడు.ఆ తర్వాత కూడా చాలా సేపు అతడిని టార్గెట్ చేస్తూ విమర్శిస్తూనే ఉన్నాడు.
దాదాపు 20 నిమిషాల పాటు ఆదిరెడ్డి – నాగ్ క్లాస్ మాత్రమే చూపించారు.అయితే, ఇందులో నాగార్జున ఎన్ని అన్నా ఆది రెడ్డి మాత్రం సారీ అయితే చెప్పలేదు.
ఈ ఎపిసోడ్ చూసిన వారంతా కూడా రేవంత్ ను హైలైట్ చేసేందేకే .ఆదిరెడ్డి కి క్లాస్ పీకారని , ఈ సీజన్ కు రేవంత్ ను విన్నర్ ను చేసేందుకే బిగ్ బాస్ ట్రై చేస్తున్నాడని అంత కామెంట్స్ వేస్తున్నారు.