డిజిటల్ రంగంలో ఆహా .ఆహా.
అనిపిస్తుంది.సినీ లవర్స్ కోరుకునే అన్ లిమిటెడ్ వినోదాన్ని అందిస్తూ దూసుకెళ్తుంది.
ఓ పక్క మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ను స్ట్రీమింగ్ చేస్తూనే.మరోపక్క పలు షోస్ తో అలరిస్తుంది.
ఇప్పటికే బాలకృష్ణ తో అన్‌స్టాపబుల్ సీజన్ ను కొనసాగుతున్న ఆహా.ఇప్పుడు కామెడీ స్టాక్ ఎక్సెంజ్ అంటూ సరికొత్త కామెడీ షో ను ప్రసారం చేయబోతుంది.
ఈ కామెడీ షోకు సుడిగాలి సుధీర్ , దీపికా పిళ్లై హోస్ట్గా వ్యవహరిస్తుండగా.జడ్జ్ గా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వ్యవహరించడం విశేషం.
దీనికి సంబదించిన ప్రోమో ను ఆదివారం విడుదల చేసారు.ప్రోమో లో మాజీ జబర్దస్త్ కమెడియన్స్ వేణు, ముక్కు అవినాష్, హరి జ్ఞానేశ్వర్ తదితరులు కనిపిస్తున్నారు.ఇక ఈ షో డిసెంబర్ 2న ప్రసారం కానుంది.వరుస విజయాలతో ఇండస్ట్రీలో రాణిస్తున్న దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ షోకు న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తుండడంతో షో కు మరింత ప్లస్ కాబోతుంది.
అనిల్ రావిపూడి సినిమాల విషయానికి వస్తే ఎఫ్ 2 తో సక్సెస్ అందుకున్న ఈయన.త్వరలో నందమూరి బాలకృష్ణ తో ఓ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు.పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించనున్న విషయం తెలిసిందే.ఇక హీరోయిన్ ఎవరా అనేది తెలియాల్సి ఉంది.








