మునుగోడు ఉప ఎన్నికలు రానే వచ్చేసింది.నిన్నటితో ప్రచారం ముగిసింది.
అయితే యథావిధిగా పంపకాలకు తెర లేపాల్సిన సమయంలో టీఆర్ఎస్ పార్టీకి కాసుల పరేషాన్ వచ్చి పడింది.తమ దగ్గర డబ్బులు లేవని మునుగోడు ఉపఎన్నికల యూనిట్ ఇన్‌ఛార్జ్ లు చేతులెత్తేస్తున్నారు.
దీంతో ఎమ్మెల్యేలు అయోమయంలో పడిపోయారు.ఎమ్మెల్యేలు ఫోన్ చేసి డబ్బులు అడగటంతో సర్దుబాటు చేసుకోవాలని చెబుతున్నారు.
అయితే ప్రచారం ప్రారంభమై నెల రోజులు గడిచింది.దీంతో ఇప్పటివరకు ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇస్తారా? లేదా? అనే విషయంపై ఆందోళన చెందుతున్నారు.
ఫైనాన్స్ వ్యవహారాల బాధ్యతలు అప్పగింత మునుగోడు ఉప ఎన్నికల షెడ్డ్యూల్ విడుదల కాగానే.సీఎం కేసీఆర్ ముగ్గురు ప్రత్యేక ఇన్‌ఛార్జ్ లను నియమించారు.ఇందులో ఫైనాన్స్ వ్యవహారాల బాధ్యతను తనకు నమ్మకస్తుడైన ఓ ఎమ్మెల్సీకి అప్పగించారు.ఆయితే ఆయనే ఏ యూనిట్‌కు ఎంత డబ్బులు పంచి పెట్టాలో నిర్ణయించేది.
ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి డబ్బులు సర్దుబాటు చేస్తూ వస్తున్నారు.అయితే గత రెండు రోజులుగా ఎమ్మెల్యేలు డబ్బులు అడిగినప్పుడు మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఎందుకు మౌనంగా ఉంటున్నారని కాల్ చేసినప్పుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారట.ఈ విషయం గురించి అడిగినప్పుడు బెదిరిస్తున్నట్లు తెలిసింది.
అయోమయంలో ఎమ్మెల్యేలు.ప్రచారం ప్రారంభమై నెల రోజులు గడిచింది.ఇప్పటికే ఆయా యూనిట్ల ఎమ్మెల్యేలు పార్టీ ఫండ్‌తో పాటు తమ సొంత డబ్బులు పంచి పెట్టారు.అయితే ఫైనాన్స్ ఇన్‌ఛార్జ్ లాస్ట్ సెకన్‌లో ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు.
దీంతో ఎమ్మెల్యేలు అయోమయంలో పడ్డారు.ప్రచారం కోసం ఖర్చు చేసిన డబ్బులు తిరిగి వస్తాయా? లేదా?.ఓటర్లకు పంచిన డబ్బులను పార్టీ ఇస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికీ మొదటి దఫా డబ్బులు రాలేదని, ఇప్పుడు రెండో దఫా అంటున్నారని ఆరోపిస్తున్నారు.
ఓటర్లకు డబ్బులు ఇవ్వడానికి ఎక్కడి నుంచి తేవాలని మండిపడుతున్నారు.ఈ క్రమంలో ఫైనాన్స్ ఇన్‌ఛార్జ్ ని పట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.