టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
రాజమౌళి దర్శకత్వంలో ఇటీవలే తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్.కాగా ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా కర్ణాటక అసెంబ్లీలో టాలీవుడ్ యంగ్ టైగర్ అద్భుతమైన స్పీచ్ ని ఇచ్చారు.తాజాగా కర్ణాటకలో ఆ రాష్ట్ర అసెంబ్లీలో కన్నడ రాజ్యోత్సవ వేడుకను నిర్వహించారు.కాగా ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కన్నడలో తన ప్రసంగాన్ని ఇచ్చారు.
అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కన్నడ ప్రజలకు కన్నడ రాజ్యోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్.అనంతరం దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు యంగ్ టైగర్.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.
పునీత్ రాజ్ కుమార్ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి.ఆయన చేసిన సేవలు అద్భుతం.అప్పుతో ఉన్న క్షణాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
ఇక్కడికి నేను అప్పుకి ఒక స్నేహితుడిగా వచ్చాను మీ అందరి అభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్.అలాగే ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు అని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్.
అలాగే అప్పూ ఫ్యామిలీ నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరించినందుకు వారికి రుణపడి ఉంటాను.అంటూ కన్నడలో మాట్లాడారు.