జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు అందించింది.రేపు సోరెన్ విచారణ నిమిత్తం ఈడీ హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు.
మైనింగ్ కుంభకోణం కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది.మైనింగ్ కేసులో నిందితుడు అయిన పంకజ్ మిశ్రా ఇంటిపై ఈడీ దాడులు నిర్వహించింది.
ఆ సమయంలో బ్యాంక్ పాస్ బుక్ తో పాటు సీఎం హేమంత్ కు సంబంధించిన చెక్ బుక్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.దీనిలో భాగంగానే అధికారులకు నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.