నవంబర్ 11న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.ఈ పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
మూడు రాజధానుల ఆంశంపై నరేంద్ర మోదీ ఏమైన స్పందిస్తారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.వైజాగ్‌లో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన తర్వాత ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభలో మోదీ ప్రసగించనున్నారు.
మొదట ఇది భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ అని భావించినప్పటికీ, ఇది అధికారిక, రాజకీయేతర బహిరంగ సభ అని, ముఖ్యమంత్రితో మంత్రివర్గ సహచరులు ఉన్నతాధికారులు కూడా హాజరవుతారని తెలుస్తోంది.బహిరంగ సభ ఏర్పాట్ల కోసం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పార్టీ సీనియర్ నేతలతో జగన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కనీసం రెండున్నర లక్షల మందిని సభకు సమీకరించే పనిని సాయిరెడ్డికి అప్పగించినట్లు సమాచారం.
విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అంశంతో పాటు మూడు రాజధానుల అంశాన్ని జగన్ తన ప్రసంగంలో లేవనెత్తవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
అలాగే మోడీ నుండి సహకారం, సహాయం కోరవచ్చని వెల్లడించాయి.మూడు రాజధానుల అంశంపై ప్రధానికి కొంత సానుకూల సందేశాన్ని ఇవ్వవచ్చని వైసీపీ పార్టీ వర్గాలు తెలిపాయి.
విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయం ఉన్న సౌత్ కోస్ట్ రైల్ జోన్ కొత్త కార్యాలయ సముదాయంతో పాటు విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరభివృద్ధి కోసం 400 కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణ పనులను ప్రధాని ప్రారంభిస్తారు.
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో గ్రీన్ క్యాంపస్, విశాఖ రిఫైనరీ, క్రూయిజ్ టెర్మినల్ పనులతో పాటు రూ.26,000 కోట్లతో ఆధునీకరణ విస్తరణ ప్రాజెక్టులకు కూడా ప్రధాని అమోదం తెలిపే అవకాశం ఉంది.అలాగే పోర్ట్ సిటీలోని పలు ప్రాజెక్టులు, రూ.385 కోట్లతో 400 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి, ఆధునిక మెగా ఫిషింగ్ హార్బర్‌కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
.