సరిగ్గా పాడలేదని చెంప మీద లాగిపెట్టి కొట్టారు.. ఎస్పీ శైలజ కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ల జాబితాలో ఎస్పీ శైలజ ఒకరు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లిగా, ఎంతో మంచి గాయనిగా పేరు తెచ్చుకున్న ఎస్పీ శైలజ తన మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందనే విషయాన్ని వివరించారు.

 Singer Sp Sailaja About Her Personal Life, Singer Sp Sailaja ,sp Subramanyam,sa-TeluguStop.com

ఓ టీవీ ఇంటర్వ్యూలో అలనాటి విశేషాలను ఎస్పీ శైలజ వెల్లడించారు.

ఇండస్ట్రీలోకి కొత్త వారు వస్తూనే ఉంటారని, వారికి అవకాశాలు వస్తూనే ఉంటాయని.

అలాంటి సందర్భాల్లో కొందరికి కొన్ని అవకాశాలు మిస్ అవుతుంటాయని ఎస్పీ శైలజ చెప్పుకొచ్చారు.తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఉందని, తాను సినిమాల్లో పాడినా, పాడకపోయినా పర్లేదు అని వివరించింది.

తాను, తన అన్నయ్య ఎస్పీ బాలు మాత్రమే శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదని, ఇంట్లో వాళ్లంతా నేర్చుకున్నారని ఎస్పీ శైలజ వివరించారు.కానీ తనను పాడాలని తల్లి బాగా ప్రోత్సహించేదని, తనకు 8 ఏళ్ల వయసులో ఏదో పాటపాడితే కావలిలో ఘంటసాల చేతుల మీదుగా ప్రైజ్ అందుకున్నానని ఎస్పీ శైలజ వివరించారు.

చిన్నప్పటి నుండి ఇంట్లోనే అందరం సాధన చేసే వాళ్లమని ఎస్పీ శైలజ వివరించారు.ఏ చిన్న తప్పు జరిగినా తన తండ్రి అస్సలు సహించే వారు కాదని అన్నారు.

ఓసారి తాను త్యాగరాజ కీర్తనలు సరిగ్గా పాడలేదని, తన తండ్రి చెంప పగలగొట్టారని ఎస్పీ శైలజ గతంలో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు.

Telugu Sailaja, Sp Sailaja, Sp Shailaja, Sp Subramanyam, Thyagaraja-Movie

తన అన్నయ్య ఎస్పీ బాలు ఓసారి విమానంలో ప్రయాణం కావాల్సి ఉండగా.తామంతా ఎయిర్ పోర్టుకు వెళ్లామని.టైం ఉందని తెలియడంతో బయటే కూర్చొని అందరం పాటలు పాడుకున్నామని శైలజ వివరించారు.

అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి తన వద్దకు వచ్చి సరదాగా, పాటపాడతావా అని అడిగారని అన్నారు.ఆ తర్వాత మార్పు సినిమాలో పాట పాడే అవకాశం వచ్చిందని ఎస్పీ శైలజ వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube