మరికొద్ది గంటల్లో నరక చతుర్దశి, దీపావళి పండుగలు రాబోతున్నాయి.ఈసారి దీపావళి కంటే ముందు రోజు ఆదివారం కావడం, వీకెండ్ సెలవులు రావడంతో ప్రజలు ప్రకృతికి నిలయమైన ప్రాంతాలకు వెళ్లి హాయిగా సమయం గడపాలని ప్లాన్ చేస్తున్నారు.
కాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రకృతి అందాలకు పెట్టింది పేరైనా లంబసింగి, చింతపల్లి, మారేడుమిల్లి గ్రామాలకు పోటెత్తుతున్నారు.ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ మూడు ప్రాంతాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ ప్రాంతాలు పర్యాటకలతో కళకళలాడుతున్నాయి.వీకెండ్ హాలిడేస్, మండే దీపావళి హాలిడే సందర్భంగా పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతాలకు వస్తున్నారు.
ప్రస్తుతం ఇండియాలో చలికాలం కూడా మొదలైపోయింది.ఈ కాలంలో ఆంధ్ర కశ్మీర్‌గా పిలుచుకునే లంబసింగి చాలా అందంగా ముస్తాబయ్యి అందరినీ మైమరిపింపజేస్తుంది.
ఇక చింతపల్లి ప్రాంతాల్లో సైతం కశ్మీర్‌లో లాంటి ఉష్ణోగ్రతలు నెలకొంటాయి.ఈ ప్రాంతంలో అక్టోబర్ 22న 16 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
అంటే అక్కడ ఎంత చల్లగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇక ఈరోజు పొద్దున పూట చింతపల్లి పరిసర ప్రాంతాల్లో 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.ఈ విషయాన్ని తాజాగా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వెల్లడించింది.
చలికాలం ఇప్పుడే మొదలైంది కాబట్టి ఉష్ణోగ్రతలు మరీ అంత దారుణంగా పడిపోలేదని వారు తెలిపారు.మరికొద్ది రోజుల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉంది.
నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి అందాలతో కనువిందు చేసే చింతపల్లి, లంబసింగి, మారేడుమిల్లి ప్రాంతాలు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటాయి.ఈ భౌగోళిక పరిస్థితుల కారణంగా ఏడాది చలికాలంలో అంటే నవంబర్, డిసెంబర్, జనవరి మాసాలలో ఇక్కడ దాదాపు 0 డిగ్రీలలో ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతుంటాయి.అంతేకాదు ఈ ప్రాంతాలలో మంచు అధికంగా కురుస్తూ కశ్మీర్‌ను తలపిస్తాయి.అందుకే లంబసింగి గ్రామాన్ని దక్షిణ కశ్మీర్ గా కూడా పిలుస్తుంటారు.ఏటా ఈ ఆహ్లాదకరమైన వెదర్‌లో నేచర్ వండర్స్ వీక్షించి ఎంజాయ్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.