దీపావళి పండుగ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.వాతావరణ కాలుష్యం దృష్ట్యా బాణాసంచా క్రయ.
విక్రయాలపై నిషేధం విధించడంతెలిసిందే.బాణా సంచాలు కొనుగోలు చేసినా.
కాల్చినా 200 రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేయడం జరిగింది.ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటన చేశారు.
దీపావళి పండుగ నాడు… ఇంట్లో దీపాలు వెలిగించుకోండి.బాణసంచా వద్దు అని చెప్పుకొచ్చారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇదే సమయంలో అక్టోబర్ 21వ తారీకు దీపావళి వెలిగించండి బాణాసంచా వద్దు అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు.
శుక్రవారం సెంట్రల్ పార్క్ వద్ద 51వేల దీపాలు వెలిగిస్తామని అన్నారు.అంతేకాకుండా బాణాసంచా తయారీ ఇంకా కొనుగోలు సహా అన్నింటిపై ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుండి జనవరి ఒకటో తారీకు వరకు నిషేధం విధించడం జరిగింది.
ఈ క్రమంలో దీపావళికి కూడా ఎటువంటి మినహాయింపు లేదు గత రెండేళ్లుగా ఇదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు.దీంతో దీపావళి పండుగ నాడు ఢిల్లీ ప్రభుత్వం విధించిన నిషేధం ఎత్తివేయాలని బీజేపీ ఎంపీ మనోజ్ తివారి అక్టోబర్ 10వ తారీఖున సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో నేడు ఈ పిటిషన్ స్వీకరణకు రావడంతో .ఆమ్ ఆద్మీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేయడానికి కోర్టు నిరాకరించింది.ఈ క్రమంలో మీ డబ్బులను స్వీట్స్ కొనుగోలు చేసేందుకు ఖర్చు చేయండి.ప్రజలను స్వచ్ఛమైన గాలి పీల్చుకోనివ్వండి అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.అయినా కానీ ఢిల్లీలో కాలుష్యాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా అని పిటీషనర్ నీ ప్రశ్నించడం జరిగింది.దీపావళి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం సమర్ధించే దిశగా వ్యవహరించింది.