మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఆచార్య సినిమా ఫ్లాప్ ఆయన నేపథ్యం లో ఈ సినిమా పై చాలా అంచనాలు ఆశలు పెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవికి గాడ్ ఫాదర్ సక్సెస్ బూస్ట్ ఇచ్చినట్లయితే ఇక తదుపరి సినిమాల విషయం లో స్పీడ్ స్పీడ్ గా నిర్ణయాలు తీసుకునే ఉద్దేశం తో చర్చలు జరుపుతున్నాడు.బాబి దర్శకత్వం లో ఒక సినిమా ను చిరంజీవి చేస్తున్న విషయం తెలిసింది.
ఆ సినిమా కు వాల్తేరు వీరన్న అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.ఇప్పటి వరకు ఆ టైటిల్ విషయం లో అధికారికం గా ప్రకటన రాలేదు.
విశ్వసనీయం గా అందుతున్న సమాచారం ప్రకారం దీపావళి కానుకగా ఆ సినిమా కు సంబంధించిన టైటిల్ ని ప్రకటించడం తో పాటు అతి త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ తెలుస్తోంది.
దీపావళి కానకగా సినిమా యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని రివల్ చేయడం తో ఆ తర్వాత టీజర్ విడుదల చేసి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల ను మొదలు పెట్టే అవకాశం ఉందని మెగా ఫాన్స్ లో ముచ్చట్లు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి కి చిరంజీవి వాల్తేరు వీరన్న సినిమా విడుదల అవ్వతుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.పెద్ద పెద్ద సినిమా లు సంక్రాంతి కి రాబోతున్నాయి.అయితే విడుదల తేదీ ల విషయం లో కాస్త అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది కచ్చితం గా వచ్చే ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి విజేత గా నిలుస్తుందని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.వాల్తేరు వీరన్న సినిమా సక్సెస్ అయితే భోళా శంకర్ సినిమా ను అంతకు మించి అన్నట్లుగా విడుదల చేసే అవకాశం ఉంది.
మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందుతున్న భోళా శంకర్ సినిమా పై అందరిలో ఆసక్తి ఉంది.