రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా తర్వాత యు వి క్రియేషన్స్ బ్యానర్ లో గౌతం తిననూరి దర్శకత్వం లో ఒక సినిమా ను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
తెలుగు లో నాని తో జెర్సీ సినిమా ను చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు గౌతం తిన్ననూరి అదే సినిమా ను హిందీ లో రీమేక్ చేసి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాడు.అందుకే రామ్ చరణ్ ఆయన దర్శకత్వంలో చేయాలా వద్ద అనే మీమాంసలో ఉన్నాడంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.
తాజాగా గాడ్ ఫాదర్ నిర్మాత ఆ విషయమై క్లారిటీ చేశాడు, చాలా రోజులుగా ఎటు తేలకుండా ఉన్న ఆ విషయం పై నిర్మాత మాట్లాడుతూ పుకార్లకు చెక్ పెట్టేశాడు.

ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతానికి ఆ కథ విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లిందని, రామ్ చరణ్ చేయాలనుకున్న కథను విజయ్ దేవరకొండ విన్నాడని.ఆయన చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ నిర్మాత పేర్కొన్నాడు.గౌతం తిన్ననూరి దర్శకత్వం లో విజయ్ దేవరకొండ హీరో గా అతి త్వరలోనే ఒక సినిమా రాబోతుంది అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.
ఆ సినిమా రామ్ చరణ్ కి చెప్పిన కథతోనే అయి ఉంటుంది అంటూ చాలామంది చాలా రకాలుగా భావిస్తున్నారు.ఆ విషయమై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
తన గత చిత్రం జెర్సీ మాదిరిగానే గౌతమ్ తదుపరి సినిమాను కూడా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లోనే తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.మొత్తానికి గౌతం తిన్న నూరి చేసిన ఒక్క సినిమాతోనే పెద్ద అవకాశం దక్కించుకున్నట్లుగానే దక్కించుకుని చేజార్చుకున్నాడు ముందు ముందు ఆయన కెరియర్ ఎలా ఉంటుందో చూడాలి.







