వైసీపీ కార్యకర్తలకు సీఎం జగన్ దిశా నిర్దేశం

అద్దంకి నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో వైసీపీ పార్టీ అధినేత, సీఎం జగన్ సమావేశమయ్యారు.దీనిలో భాగంగా పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేశారు.

 Cm Jagan's Direction To Ycp Workers-TeluguStop.com

సమావేశంలో ప్రతీ కార్యకర్తతో విడివిడిగా మాట్లాడిన జగన్.కార్యకర్తల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.19 నెలల్లో ఎన్నికలు రానున్నాయని సీఎం జగన్ తెలిపారు.ఈ నేపథ్యంలో పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇకపై వేసే ప్రతి అడుగు ఎన్నికల దిశగా ఉండాలని సూచించారు.అద్దంకి నియోజకవర్గంలో టిడిపిపై వ్యతిరేకత ఉందని జగన్ తెలిపారు.

గ్రామం నుంచి యూనిట్ గా పనిచేయాలని, ప్రతి ఇంటికి వెళ్లి చేసిన పనిని చెప్పాలని కార్యకర్తలకు సూచించారు.అద్దంకిలో మునిపెన్నడూ లేని విజయాన్ని నమోదు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.తనతో పాటు కార్యకర్తలందరం కృషి చేస్తేనే 175 కి 175 సీట్లు వస్తాయని పేర్కొన్నారు.175 సీట్లు సాధించడం అసాధ్యం ఏమి కాదన్న సీఎం జగన్.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలు వైసీపీనే గెలవాలని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube