గుంటూరు జిల్లా (అమరావతి): తెలుగుదేశం పార్టీ కేంద్రకార్యాలయం, ఎన్టీఆర్ భవన్, మంగళగిరి: మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా ఆనంద్ బాబు గారి విలేకరుల సమావేశం వివరాలు.ఉత్తరాంధ్రను ఉడ్చేసి ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరు తో రాజకీయం చేయడం సిగ్గుచేటు.
ఉత్తరాంధ్రకు చెందినటువంటి వైసీపీ నాయకులు మంత్రులు ఎంపీ విజయసాయిరెడ్డి ఆక్కడ ప్రజానీకాన్ని రెచ్చ కొట్టే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు.వీళ్ళు మూడు రాజధానులు తీసుకొచ్చి ఉద్ధరించబోతున్నట్లు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి మూడు రాజధానిలే శరణ్యం, పరిపాలన వికేంద్రీకరణ ముఖ్యమని మాట్లాడుతున్నారు.
ఉత్తరాంధ్రకు చెందినటువంటి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సత్యనారాయణ ఉత్తరాంద్ర కి చేసింది ఏమిటి అంటే పోటీలు పడి పేదల భూములు, అసైన్డ్ భూములు, సైనికుల భూములు రికార్డులు మార్చి కొట్టేశారు.
ఈ జగన్మోహన్ రెడ్డి మూడుముక్కలాట మొదలు పెట్టిన తర్వాత విశాఖ పట్టణంలో దాదాపు 40 వేల రిజిస్ట్రేషన్ జరిగినాయి.72000 ఎకరాలు చేతులు మారినాయి.ఇందులో దాదాపు 90 శాతం మంత్రులు వాళ్ళ బినామీలు విజయసాయిరెడ్డి బినామీ లవే.ఉత్తరాంధ్రకు చెందినటువంటి మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది.మంచి వాగ్దాటి కలిగినటువంటి మంత్రి పిట్ట కథలు బాగా చెప్పగలడు.
ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఎన్నో విషయాలు మాట్లాడాడు.ముఖ్యమంత్రి కుమారుడిగా ఉండి 67 సూట్ కేసు కంపెనీలు పెట్టిన ఘనుడు అని రెండు లేదా మూడు బెడ్రూంలు కుటుంబానికి సరిపోతుంది.60 బెడ్ రూములతో ఇల్లు కట్టుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి పేదలకు సేవ చేస్తాడట అని ఎద్దేవా చేసిన ధర్మాన.
సిబిఐ జగన్మోహన్ రెడ్డి మీద దాఖలు చేసిన చార్జిషీట్లో A5 నిందితుడుగా ఉన్నాడు ఈ ఎండకి ఆ గొడుగు పట్టడం అనేది ధర్మాన ప్రసాదరావుకి వెన్నతో పెట్టిన విద్య.2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని సమర్థించాడు రోజు ఉత్తరాంధ్రలో ప్రజలను రెచ్చగొడుతున్న ఏకైక వ్యక్తి ధర్మాన ప్రసాదరావు.ఈయన రెవిన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు మాజీ సైనిక్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి 77 ఎకరాల భూమికి అమ్ముకోవడానికి నిరంభ్యంతర పత్రం ఇచ్చి ధర్మాన కుటుంబ సభ్యులు మొత్తం రియల్ ఎస్టేట్ గా మార్చారు.
దానిమీద సీట్ ఎంక్వయిరీ వేసి దోషులు గా తేల్చారు ఇప్పుడు ఆ భూములు రేట్లు పడిపోయయి అటు విలువ పెంచుకుంటానికి ధర్మాన ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు.కులాల మధ్య కుంపట్లు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఈ మంత్రులు ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండటానికి వీల్లేదు.
విశాఖపట్నం అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక కక్ష ఒక కసి అందుకనే విశాఖపట్నం మీద విధ్వంసం మొదలుపెట్టాడు ఎందుకంటే వాళ్ళ తల్లి గారిని అక్కడ ప్రజలు తిరస్కరించారు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా విశాఖపట్నం టౌన్ లో నాలుగు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది.అందుకే విశాఖపట్నం వాసుల మీద పగబట్టి విధ్వంసం కి తెరలేపాడు.
విశాఖపట్నం ఉత్తరాంధ్రని దోపిడీని ప్రజలు ఎక్కడ గమనిస్తారు అని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.విజ్ఞత కలిగిన ప్రజలు అన్ని విధాల ఆలోచన చేయాలి ఉత్తరాంధ్ర అని అభివృద్ధి చేసింది ఎవరు? గాలికి వదిలేసింది ఎవరు వీళ్ళు చేసే అసత్య ప్రచారాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు అని నేను భావిస్తున్నాను.