పెన్నులపై సిలబస్ మొత్తం చెక్కేసిన మేధావి.. పరీక్షల్లో స్లిప్స్ ఇలా కూడా పెట్టొచ్చా?

పరీక్షల్లో గట్టెక్కడం కోసం చాలా మంది విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతారు.బాగా చదివిన వారికి వీటితో పని ఉండదు.

 The Genius Who Wrote The Entire Syllabus On Pens.. Can Slips Be Put In Exams Lik-TeluguStop.com

అయితే సరిగ్గా చదవని వారిని, తల్లిదండ్రులు కొడతారనే భయం ఉన్న వారికి స్లిప్స్ పెట్టాలని ఆలోచన వస్తుంది.చాలా మంది పేపర్‌పై సూక్ష్మంగా అక్షరాలు రాసి, వాటిని సీక్రెట్ ప్లేస్‌లలో దాస్తుంటారు.

పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ చూడని సమయంలో వాటిని బయటకు తీసి, రాసేస్తుంటారు.అయితే స్పెయిన్‌ ఒక విద్యార్థి తన పరీక్షలో కాపీ చేయడానికి తన మొత్తం సిలబస్‌ను కేవలం 11 పెన్నుల పూర్తి వ్యాసంతో చెక్కాడు.

మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో ఇటీవల పెన్ చిత్రాలు కనిపించాయి.అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

స్పెయిన్‌లో లా పరీక్షలు ఇటీవల జరిగాయి.

ఓ విద్యార్థి నీలిరంగు పెన్నుల ప్యాక్‌పై చిన్న అక్షరాలతో సిలబస్ మొత్తం చెక్కాడు.అయినప్పటికీ, అతను ఇన్విజిలేటర్‌కు పట్టుబడ్డాడు.

ఆ 11 పెన్నుల ఫోటోలను గత వారం యోలాండా డి లూచీ అనే ప్రొఫెసర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.మొదటి చూపులో పెన్నులు సాధారణమైనవిగా అనిపించినప్పటికీ, పెన్నులను సరిగ్గా గమనిస్తే వాటిపై మనకు చిన్న చిన్న అక్షరాల రూపంలో సిలబస్ మొత్తం కనపడుతుంది.

ఇది చూసిన ఇన్విజిలేటర్లు ఆశ్చర్యపోయారు.కాపీయింగ్ ఇలా కూడా చేస్తారా అంటూ నోరెళ్ల బెట్టారు.

Telugu Hitech, Latest, Syllabus-Latest News - Telugu

అయితే ఆ పని చేసిన విద్యార్థిని మాత్రం నిబంధనల ప్రకారం డీబార్ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసినప్పటి నుండి, పోస్ట్‌కి 3.8 లక్షల లైక్‌లు, 24,000 రీట్వీట్‌లు వచ్చాయి.చాలా మంది వినియోగదారులు ఆ యువకుడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు.

అయితే ఇలాంటి తెలివి ఉన్న విద్యార్థి తన ప్రతిభను సిలబస్ అధ్యయనం చేయడంలో చూపించి ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు.ఇలాంటి జాతిరత్నాలు ఉంటే పరీక్షలు నిర్వహించే సమయంలో ఇన్విజిలేటర్‌లకు దిమ్మ తిరుగుతుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube