మంత్రి కేటీఆర్‌ను వీఆర్ఏ ప్రతినిధులు మరోసారి కలిశారు.ఈ క్రమంలో వీఆర్ఏలు సమ్మెను విరమించాలని మంత్రి కోరారు.
వీఆర్ఏలకు ఇచ్చిన హామీల అమలుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని స్పష్టం చేశారు.త్వరలోనే వీఆర్ఏల సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు.
ఇందుకు ప్రభుత్వానికి కొంత సమయం కావాలన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం, వీఆర్ఏలు వేర్వేరు కాదన్న ఆయన.ఇదే అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.