క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం పుష్ప.పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది.
పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయినా ఈ సినిమా ఎన్నో అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుంది.ఇక తాజాగా ఈ సినిమా అవార్డులలో భాగంగా అన్ని విభాగాలలో అవార్డులను సొంతం చేసుకుంది.
ఈ సినిమా విడుదలై దాదాపు ఆరు నెలలు పూర్తి అయిన ఇంకా ఈ సినిమాకి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.
ఇకపోతే తాజాగా ఈ సినిమా మరొక రికార్డు సొంతం చేస్తుంది.
మాస్కోలో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ ఫెస్టివల్ లో స్పెషల్ స్క్రీనింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది.వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలలో భాగంగా ఈ సినిమా కూడా చోటు సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా అక్కడ తెలుగులో ప్రసారం కాగా ఇంగ్లీష్ మరియు రష్యన్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది.ఈ విధంగా ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్ లో పుష్ప సినిమా స్క్రీనింగ్ కావడంతో బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా పుష్ప2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది.పుష్ప సినిమా విజయం కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక పుష్ప పార్ట్ 2 లో అల్లు అర్జున్ ఫహిద్ పాజిల్ మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
మరి ఈ సినిమా ద్వారా పుష్పరాజ్ ప్రేక్షకులను ఎలా సందడి చేస్తారో తెలియాల్సి ఉంది.







