ల్యాబ్ రిపోర్ట్‌లో తప్పుల కారణంగా ఓ భారత సంతతి అమెరికా మహిళకి ఇబ్బందులు కలిగేలా వ్యవహరించిన ల్యాబొరేటరీపై చండీగఢ్‌లోని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.బాధిత మహిళకు విమాన టికెట్ల ధర రూ.74,685 చెల్లించాలని ఆదేశించింది.అలాగే మహిళకు మానసిక క్షోభ కలిగించినందుకు మరో రూ.50,000… కోర్టు ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని హుకుం జారీ చేసింది.
అసలేం జరిగిందంటే.అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఫోల్సోమ్‌లో నివసిస్తున్న నీలం రాణా కుష్వాహా.షవేతా సంఘీ ద్వారా కోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం 2021 మే నెలలో న్యూఢిల్లీ అంతర్జాతీ విమానాశ్రయం నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయానికి ఖతార్ ఎయిర్‌వేస్ ద్వారా నీలం టికెట్లు బుక్ చేశారు.దేశంలో అప్పటి కరోనా పరిస్ధితుల నేపథ్యంలో జూన్ 10న వీరి ప్రయాణం షెడ్యూల్ చేశారు.
అయితే అప్పుడు అంతర్జాతీయ విమానం చేయాలంటే సవాలక్ష ఆంక్షలు అమల్లో వుండేవి.ప్రయాణానికి ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించి అధికారులకు సమర్పించాలి, నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే విమానం ఎక్కేందుకు అనుమతించేవారు.

దీంతో ప్రయాణానికి 48 గంటల ముందు అంటే జూన్ 8న నీలం చండీగఢ్‌లోని అతులయ ల్యాబ్‌లో కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారు.అనంతరం వాట్సాప్ ద్వారా నిర్వాహకులు కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ పంపారు.నెగిటివ్ వచ్చినప్పటికీ… రిపోర్టుల్లో వారి జాతీయత, పుట్టినతేదీని ల్యాబ్ నిర్వాహకులు సరిగా పేర్కొనలేదు.ధ్రువపత్రాల ప్రకారం నీలం వయసు 53 సంవత్సరాలైతే.
ల్యాబ్ రిపోర్టులో 52గా ప్రస్తావించారు.దీనిని గుర్తించిన నీలం వెంటనే ల్యాబ్ ప్రతినిధులను సంప్రదించి తప్పులపై నిలదీసింది.
దీనికి స్పందించిన నిర్వాహకులు.తాము ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌లో వివరాలను సరిచేశామని చెప్పారు.
కానీ వారు వెబ్‌సైట్‌లో వివరాలను సరిచేయకపోవడంతో… నీలం కుటుంబ సభ్యులను విమానం ఎక్కేందుకు ఖతార్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అనుమతించలేదు.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నీలం .వినియోగదారుల ఫోరంలో పిటిషన్ దాఖలు చేసింది.దీంతో అతులయ ల్యాబ్స్‌కు కమీషన్ నోటీసు పంపింది.
కానీ దీనికి ఎవరు స్పందించకపోవడం, విచారణకు హాజరుకాకపోవడంతో .ల్యాబ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు దోషిగా తేల్చింది.దీనితో పాటు ఫిర్యాదు దాఖలైన తేదీ నుంచి తీర్పు వెలువరించే వరకు విమాన టికెట్ ఛార్జీ రూ.74,685. దీనిపై 9 శాతం వడ్డీని నీలంకు చెల్లించాలని ల్యాబ్ యాజమాన్యాన్ని ఆదేశించింది.