ఆంధ్రుల రాజధానిగా అమరావతే ఉంటుందని బీజేపీ నేత సుజనాచౌదరి అన్నారు.అమరావతిపై కేంద్రం మాత్రమే సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
వైసీపీ నేతలు ఎవరికి వారు రాజధానిపై రోజుకో మాట చెబుతున్నారని మండిపడ్డారు.మూడు రాజధానులు నిర్మించడం వైసీపీ వల్ల కాదని విమర్శించారు.
తమ హక్కు కోసం మహా పాదయాత్రకు సంకల్పించిన రైతులకు బీజేపీ పూర్తి మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు.