పవన్ 'సాహో'... ఫ్యాన్స్ కి సంతోషాన్ని కాదు కోపంని తెప్పిస్తోంది

పవన్ కళ్యాణ్ హీరోగా సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసింది.ఈ సినిమా ప్రకటన కొంత మంది పవన్ కళ్యాణ్ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తే మరి కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం కోపాన్ని తెప్పిస్తుంది.

 Pawan Movie With Saaho Director Fans Unhappy Details, Pawan Kalyan, Sujeeth, Saa-TeluguStop.com

ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా సినిమాలకు కమిటీ అయ్యాడు.వాటిలో ఒకటి రెండు షూటింగ్ దశలో ఉన్నాయి.

ఆ సినిమాలను పూర్తి చేసిన తర్వాత కొత్త సినిమాలను కమిట్‌ అయితే బాగుంటుంది.కానీ వరుసగా సినిమాలను కమిట్‌ అయితే ఏ సినిమాలు చేస్తున్నాడో తెలియక జుట్టు పీక్కోవాల్సి వస్తుందని, పైగా రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల సినిమాల షూటింగ్ లకు ఎక్కువ డేట్లు ఇవ్వలేక పోతున్న పవన్ కళ్యాణ్ ఎందుకు ఇన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడో అర్థం కావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే దర్శకుడు క్రిష్, పవన్ వల్ల ఏకంగా రెండు సంవత్సరాల సమయంలో హరిహర వీరమల్లు సినిమాకి కేటాయించాల్సి వచ్చింది.ఇక దర్శకుడు హరీష్ శంకర్ గత రెండేళ్లుగా పవన్ కళ్యాణ్ డేట్ ల కోసం ఎదురు చూస్తున్నాడు.

అలాగే మరి కొందరు దర్శకుడు కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నారు.వారందరూ ఇతర సినిమాలు చేయకుండా కేవలం పవన్ డేట్లు ఇస్తాడేమో సినిమా మొదలు పెట్టాలి అని భావిస్తున్నారు.

Telugu Harish Shankar, Krish, Harihara, Telugu, Pawan Kalyan, Pawankalyan, Saaho

ఇలాంటి సమయంలో సాహో దర్శకుడు కూడా పవన్ కళ్యాణ్ దర్శకుల జాబితాలో చేరడంతో కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.సాహో సినిమా వచ్చి చాలా కాలం అయింది.ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా అంటూ సుజిత్ వెయిటింగ్ చేయడం మొదలు పెడితే మరీ కొంత కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది.అది ఆయన కెరీర్ కి చాలా నష్టం చేకూర్చుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ తో ఎంత వెయిట్ చేసి సినిమా ను చేసినా కూడా ఫలితం ఉంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి పవన్ సాహో సినిమా పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube