ఎలాంటి మచ్చ లేకుండా ముఖం క్లియర్‌గా, గ్లోయింగ్‌గా ఉంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.అందుకే మచ్చలేని చర్మం కోసం మార్కెట్‌లో లభ్యమయ్యే రకరకాల క్రీమ్స్, సీరమ్స్, ఫేస్ మాస్క్స్ తదితర వాటిని కొనుగోలు చేసి యూస్ చేస్తుంటారు.
అయితే వాటి వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందో తెలియదు గానీ.ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీస్‌ను ట్రై చేస్తే మాత్రం క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీసొంతం అవుతుంది.
మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీస్ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో ముఖానికి, మెడకు అప్లై చేసుకుని.ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
కంప్లీట్‌గా డ్రై అయిన అనంతరం వాటర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇప్పుడు మరో బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్ వేసుకుని బాగా మిక్స్ చేస్తే సీరమ్ సిద్ధం అవుతుంది.ఈ సీరమ్‌ను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.పైన చెప్పిన ఫేస్ ప్యాక్‌ను వేసుకున్నాక.
ఈ సీరమ్‌ను స్కిన్‌కు అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్నా క్రమంగా మాయం అవుతాయి.
అదే సమయంలో ముఖం గ్లోయింగ్‌గా మరియు ఎట్రాక్టివ్‌గా కూడా మారుతుంది.