10వ తరగతి సర్టిఫికెట్ పోయిందా?..అయితే ఇలా తెచ్చుకోండి..

విద్యార్థి దశలో ఎంతో కీలకమైంది పదో తరగతి.మనం ఎటువంటి జాబ్ కి అప్లయి చేయాలన్నా కావాల్సిన వాటిలో టెన్త్ సర్టిఫికేట్ తప్పనిసరి.

 10th Class Certificate Lost , 10th Class, Certificate, Missing, Steps, Technolog-TeluguStop.com

అంత ముఖ్యమైన సర్టిఫికెట్ ని అనుకోకుండా పోగొట్టుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.అలాంటప్పుడు ఏం చేయాలి.

తిరిగి మనం టెన్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.కానీ ఇప్పుడు ఒక సులభమైన విధానం అమల్లోకి వచ్చింది.

మనం పోగొట్టుకున్న టెన్త్ సర్టిఫికెట్ తిరిగి పొందాలంటే కేవలం ఇంటర్నెట్ ఉంటే చాలు.ఇంటర్నెట్ ద్వారా మనం డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పదో తరగతి సర్టిఫికెట్ ఆన్ లైన్ లో ఎలా పొందాలి?
*మనం పోగొట్టుకున్న పదో తరగతి సర్టిఫికెట్ పొందేందుకు మీ వద్ద హాల్ టికెట్ నబంర్ లేదా ఆ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ అయినా ఉండాల్సిందే.
*మొదటగా memos.bseap వెబ్ సైట్ ని ఓపెన్ చేయాలి.
*SSC బోర్డుకు సంబంధించిన డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ పేజీ కనిపిస్తుంది.
*అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఏ సంవత్సరంలో పరీక్ష రాశారు, రెగ్యులరా లేదా సప్లిమెంటరీనా లేదా ప్రైవేట్ అని ఉంటాయి.

వాటిని ఎంటర్ చేయాలి.
*కింద నంబర్ కోడ్ ఉంటుంది.

అక్కడ టైప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.
*ఆ విధంగా మీ వివరాలు అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
*మీ వివరాలన్నీ కరెక్ట్ గా ఉంటే మీ ఒరిజినల్ సర్టిఫికెట్ కనబడుతుంది.
*దానిని ప్రింట్ తీసుకోవచ్చు.
*మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.2004 సంవత్సరం నుంచి ఆ పైన చదివిన వారికి మాత్రమే ఈ విధానం అమల్లో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube