నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.ఇలా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అతి తక్కువ సమయంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగ గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇకపోతే ఈమె పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గుర్తింపు సంపాదించుకుంది.ఈ సినిమా తర్వాత రష్మికకు వరుసగా సినిమా అవకాశాలు రావడమే కాకుండా బాలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే ఈమె హీరోయిన్ గా నటించడమే కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సీతారామం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరోయిన్ మృణాల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని రష్మిక గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

రష్మికలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి.ఆమె వరుస సినిమా షూటింగులు నిమిత్తం ఒకరోజు ముంబై మరొక రోజు చెన్నై మరొక రోజు హైదరాబాద్ అంటూ ఇలా రోజుకో నగరానికి వెళ్తూ తన సినిమా షూటింగ్లలో పాల్గొంటారు.ఇలా ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నప్పటికీ తాను ఎంతో చలాకిగా హుషారుగా ఉండడమే కాకుండా సెట్ లో అందరితో చాలా సరదాగా ఉంటుందని ఈమె తెలిపారు.ఇక ప్రతి ఒక్క విషయంలోనూ రష్మిక ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది అంటూ ఈ సందర్భంగా మృణాల్ నటి రష్మిక గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈ సినిమాలో రష్మిక తరుణ్ భాస్కర్ జోడిగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.