కొన్ని కొన్ని సార్లు హీరోయిన్ లు ఒక్క సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కూడా ఆ తర్వాత ఎందుకో అవకాశాలు అందుకోలేక పోతారు.ఒకవేళ అవకాశాలు వచ్చినా కూడా అంతగా సక్సెస్ కాలేకపోతారు.
ఇలా చాలామంది హీరోయిన్లు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు.
అయిన కూడా ఇండస్ట్రీలో ఉండాలన్న పట్టుదలతో అవకాశాలు సంపాదించుకోవటం కోసం గ్లామర్ షోలు కూడా చేస్తున్నారు.
సోషల్ మీడియాలో తమ అందాల విందును వడ్డిస్తున్నారు.అలా కొందరు అవకాశాలు అందుకుంటే మరికొందరు అసలు అందుకోవటం లేదు.
ఇక అందులో ఒకరు అంజలి.
టాలీవుడ్ నటి తెలుగు ముద్దుగుమ్మ అంజలి పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.తన పాత్రకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది.తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటించింది.
కానీ తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం అంతా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది అంజలి.2006లో ఫోటో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అంజలి ఆ తర్వాత ఏడాది తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.ఇక అక్కడే వరుస సినిమాలలో సెటిలైన మళ్లీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రి ఇచ్చింది.

ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది.తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు రాగా మళ్ళీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక వకీల్ సాబ్ సినిమాలో నటించగా తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.కానీ అంజలికి ఆఫర్లు మాత్రం అంతగా రాలేకపోయాయి.ఇక ఎన్నోసార్లు అంజలి టాలీవుడ్ కు రీ ఎంట్రీ కూడా ఇవ్వగా సక్సెస్ లు రాకపోవడానికి కారణం మాత్రం మరొకటి ఉందట.
తను అతి తక్కువ సమయంలోనే సీనియర్ హీరోల సరసన నటించడంతో డిమాండ్ తగ్గిందని, అంతేకాకుండా తర్వాత చేయవలసిన హారర్ సినిమాలు కూడా ముందుగానే చేసేసిందని, ఇక అదే సమయంలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించడంతో.
అలా ఒకే సమయంలో ఓకే దానిపై ఆధారపడి ఉండక తొందర పడటం వల్ల తనకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయని గతంలో తెలిసింది.

దీంతో తనకు అవకాశాలు రాకపోవడంతో తను గ్లామర్ షో కూడా చేయటానికి సిద్ధమయింది.ఏకంగా పొట్టి పొట్టి బట్టలు ధరించి బాగా డోస్ పెంచి తన అందాలను బయటకు వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.అయినా కూడా అవకాశాలు అందుకోవట్లేదు అని తెలుస్తుంది.
పైగా ఈ మధ్య కొత్త కొత్త హీరోయిన్లు రావడం వల్ల కూడా తనకు అవకాశాలు రావట్లేదు అని అర్థమవుతుంది.
ఇక తాజాగా ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.
దీంతో ఈ అమ్మడికి హీరోయిన్ గా నటించే అవకాశాలు దరిచేరట్లేదు అని కేవలం స్పెషల్ సాంగులల్లో మాత్రమే నటించడానికి ఈ అమ్మడను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.