రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
ఈ వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ గా జరిగింది.నాని ఈ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొన్నాడు.
దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.సినిమా ను తప్పకుండా వెళ్లి థియేటర్లలో చూడండి అంటూ విజ్ఞప్తి చేశాడు.
అంతే కాకుండా థియేటర్ల కు నష్టం జరగకుండా ఉండేందుకు కాస్త రిస్క్ తీసుకుని అడ్వాన్స్ బుకింగ్ ను చేసుకోకుండా థియేటర్ కు వెళ్లి మరీ టికెట్ ను తీసుకోవాలి అంటూ విజ్ఞప్తి చేశాడు.సినిమా టికెట్ ను బుక్ మై షో లో బుక్ చేసుకోవడం ద్వారా ఎక్కువ అవుతుంది.
అందుకే మీరు డైరెక్ట్ గా థియేటర్ కు వెళ్లడం వల్ల తక్కువ రేటుకు టికెట్ వస్తుంది అన్నట్లుగా సలహా ఇచ్చాడు.
ఇప్పుడు టికెట్ బుకింగ్ మొత్తం కూడా ఆన్ లైన్ అయిన విషయం తెల్సిందే.
ఇలాంటి సమయంలో రామా రావు ఆన్ డ్యూటీ సినిమా ను దర్శకుడు చెప్పాడని వెళ్లి థియేటర్ల వద్ద లైన్ లో నిల్చుని తీసుకుంటారా అంటే అనుమానమే.అయినా కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం వల్ల కంటే డైరెక్ట్ గా తీసుకోవడం వల్లే అన్ని విధాలుగా సినిమా కు మంచిది.
అందుకే దర్శకుడి సలహా ను పాటించడం మంచిదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రామా రావు ఆన్ డ్యూటీ సినిమా పై అంచనాలు దర్శకుడితో పాటు అందరి లో కూడా అంచనాలు ఉన్నాయి.
మరి రామా రావు ఎంత వరకు ఆ అంచనాలను అందుకుంటాడో చూడాలి.