సినిమా తీయడం ఒక ప్రాసెస్ అయితే ఆ సినిమాకి టైటిల్ పెట్టడం మరొక ఎత్తు అనే చెప్పాలి.అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో సినిమాలకు తెలుగు పేర్లను మాత్రమే టైటిల్స్ గా పెట్టేవారు.
కానీ ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి.ఇప్పుడు అంతా తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలా అన్ని భాషలను కలిపి టైటిల్స్ గా పెడుతున్నారు.
ప్రేక్షకులు కూడా వాటికే అలవాటు పడుతున్నారు.
అందులోను ఇటీవల కాలంలో పాన్ ఇండియా వ్యాప్తంగా సినిమాలు రిలీజ్ చేయడంతో ఇలాంటి టైటిల్స్ అయితే అక్కడ కూడా రీచ్ అవుతాయి అని అలా యూనివర్సల్ టైటిల్స్ కే మొగ్గు చూపిస్తున్నారు.
అయితే స్టార్ హీరోల సంగతి ఎలా ఉన్న మన టాలీవుడ్ యంగ్ హీరోలు మాత్రం తెలుగు టైటిల్స్ కే మక్కువ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది.
ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్న హీరోలంతా ప్రకటించిన టైటిల్స్ చుస్తే ఇదే అర్ధం అవుతుంది.
యంగ్ హీరోలు తమ టైటిల్స్ లోనే కథ ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

మరి ఆ హీరోల్లో ముఖ్యంగా చెప్పుకునే వారిలో కిరణ్ అబ్భవరం ఉన్నాడు.ఇతడు కెరీర్ స్టార్టింగ్ నుండే ఇలాంటి కంటెంట్ బేస్డ్ టైటిల్స్ ను ప్రకటిస్తున్నాడు.ఇటీవలే సమ్మతమే అంటూ వచ్చిన ఈ హీరో ఇప్పుడు వినరో భాగ్యము విష్ణు కథ, నేను మీకు బాగా కావాల్సిన వాడిని లాంటి టైటిల్స్ ప్రకటించడంతో జనాలకు చేరువవుతున్నాయి.

అలాగే నాగ శౌర్య కూడా ఇలాంటి క్రేజీ టైటిల్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు.కృష్ణ వ్రింద విహారి అనే రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నాడు.ఇంకా మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా సాఫ్ట్ టైటిల్ నే ఎంచుకుంటూ వస్తున్నాడు.ప్రెసెంట్ ఈయన రంగరంగ వైభవంగా సినిమా చేసున్నాడు.అలాగే సుధీర్ బాబు కూడా సమ్మోహనం, వీరభోగ వసంతరాయులు, నన్ను దోచుకుందువటే వంటి క్రేజీ టైటిల్స్ తో అలరిస్తున్నాడు.త్వరలోనే మామ మచ్చేసిందిరా అనే సినిమాతో రాబోతున్నాడు.