అక్కినేని యువ హీరో అఖిల్ తన మొదటి కమర్షియల్ హిట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ అందుకున్నాడు.బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తరకెక్కిన బ్యాచిలర్ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు.
ఈ మూవీలో అఖిల్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది.పూజా గ్లామర్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని తెలిసిందే.
ఇక ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో అఖిల్ మరోసారి మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు.
ఇక ఏజెంట్ తర్వాత అఖిల్ మళ్లీ బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లోనే సినిమా చేస్తాడని అంటున్నారు.బ్యాచిలర్ సినిమా తర్వాత నాగ చైతన్యతో ఒక సినిమా అనుకున్నాడట డైరక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ సైడ్ అయ్యింది.
ఇక ఇదే క్రమంలో అఖిల్ కోసం కూడా ఒక కథ సిద్ధం చేయగా అది అఖిల్ కి వినిపించడంతో ఓకే అన్నట్టు టాక్.త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.
ఏజెంట్ తర్వాత అఖిల్ చేసే సినిమా దాదాపు బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లోనే అని తెలుస్తుంది.