సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వం లో రూపొందిన సర్కారు వారి పాట సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ముఖ్యంగా కళావతి మరియు మమ మహేష సినిమ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది.రికార్డు బ్రేకింగ్ వసూళ్లను సర్కారు వారి పాట దక్కించుకుంది.
మూడు వారాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా లో మరో పాటను యాడ్ చేయడం జరిగింది.సినిమా ప్రమోషన్ కార్యక్రమాల సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు మురారి వా అనే పాట ఉంది.
దాన్ని తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.త్వరలోనే సినిమా లో కలుపుతాం లేదంటే యూట్యూబ్ ద్వారా విడుదల చేస్తాం అన్నారు.

థియేటర్ ల్లో ఈ పాటను విడుదల చేయడం జరిగింది.ఈ పాట కోసం కొద్ది మంది అయినా రిపీట్ ఆడియన్స్ వస్తారంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అనుకున్నట్లుగానే ఈ పాట కోసం అభిమానులు కొందరు క్యూ కట్టారు.పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కిందట.మమ మహేష పాట కు ఎలాంటి మాస్ రెస్పాన్స్ వచ్చిందో అలాగే ఈ పాట కు ప్రేక్షకుల నుండి దక్కింది.ముఖ్యంగా ఈ పాట లో కీర్తి సురేష్ స్కిన్ షో గురించి చెప్పుకోవాలి.
ఇప్పటి వరకు ఏ సినిమా లో కూడా ఈ అమ్మడు అంత అందంగా ముఖ్యంగా అంతగా నడుము అందాన్ని చూపించలేదు.నడుము నాభి అందాన్ని ఇప్పటి వరకు చూపించని కీర్తి సురేష్ మొదటి సారి ఈ సినిమా లో ఆ అందాన్ని అభిమానుల కోసం చూపిస్తుంది.
మహేష్ బాబు కంటే కూడా అధికంగా ఈ పాట లో కీర్తి సురేష్ హైలైట్ అయ్యిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.