విజయ్ దేవరకొండ శివ నిర్వాణ కాంబోలో ఒక సినిమా వస్తుంది.ఈ సినిమాను ఇటీవలే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్ చేసారు.
విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది.ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ అని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి.
ఈ సినిమా స్టార్ట్ అవ్వడంతోనే అంచనాలు భారీగా పెరిగాయి.
విజయ్, సమంత జోడీ అంటే మరింత ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.
విజయ్ కెరీర్ లో ఈ సినిమా 11వ సినిమాగా తెరకెక్కుతుంది.ఇప్పటికే కాశ్మీర్ లో ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు.
సౌత్ ఇండస్ట్రీలలో అన్ని ప్రధాన భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు.అయితే ప్రేక్షకులు ఈ జోడీ గురించి ఒక విషయం చర్చించు కుంటున్నారు.
వీరిద్దరూ ఆన్ స్క్రీన్ లో కెమిస్ట్రీ తో మెప్పించడమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా కొన్ని విషయాలు దాదాపు ఒకేలా ఉంటాయని అనుకుంటున్నారు.సామ్ తన సంపాదనలో కొంత భాగం ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు మహిళలకు సహాయం చేస్తున్న విషయం విదితమే.అదే తరహాలో విజయ్ కూడా తన ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం చేస్తున్నాడు.ఇక ఈయన రౌడీ బ్రాండ్స్ తో టెక్స్ టైల్ బిజినెస్ స్టార్ట్ చేసినట్టే సమంత కూడా సాకీ అనే బ్రాండింగ్ వ్యాపారంలో దూసుకు పోతుంది.
ఇలా సమంత, విజయ్ ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా ఒకేలా సాగుతుండడం అందరిని ఆకర్షిస్తుంది.మరి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో ఈ జంట ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాల్సిందే.
ఖుషి వీరి కెరీర్ లో ప్లస్ అవుతుందో లేదో వేచి చూడాలి.