దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు ఒక వర్గం ప్రేక్షకుల్లో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో హీరోయిన్ రోల్ అంటే ఆ పాత్రకు కచ్చితంగా ఏదో ఒక లోపం ఉంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.తన తొలి సినిమా నుంచి త్రివిక్రమ్ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు.
నువ్వే నువ్వే సినిమాతో దర్శకునిగా త్రివిక్రమ్ కెరీర్ ను మొదలుపెట్టగా ఈ సినిమాలో శ్రియ అమాయకురాలిగా కనిపిస్తారు.కోటీశ్వరురాలు అయినా పెద్దగా లోకజ్ఞానం లేని అమ్మాయిలా కనిపించారు.
కోటీశ్వరురాలు అయినా డబ్బుల విషయంలో అమాయకమైన సమాధానాలు చెబుతూ శ్రియ నవ్వులు పూయించారు.అతడు సినిమాలో త్రిష పాత్ర ప్రపంచంలో ఆమెను మించిన మరో అందగత్తె లేదని ఫీలయ్యేలా ఉంటుంది.
ఈ పాత్ర చేసే ఓవర్ యాక్షన్ ప్రేక్షకులను నవ్విస్తుంది.

ఖలేజా సినిమాలో అనుష్క పాత్రను ఐరన్ లెగ్ అంటూ త్రివిక్రమ్ చేయించిన కామెడీ అంతాఇంతా కాదు.అయితే కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ కాలేదు.జులాయి సినిమా ఫస్ట్ హాఫ్ లో ఇలియానా సోడా బుడ్డీ కళ్లద్దాలతో పంటికి క్లిప్పులతో వెరైటీ డ్రెస్సులతో కనిపించారు.
సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సమంత పాత్రకు డయాబెటిస్ ఉంటుంది.నిజ జీవితంలో కూడా సమంత డయాబెటిస్ బారిన పడి వ్యాయామాల ద్వారా షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకున్నారు.

అఆ సినిమాలో చిన్న విషయానికి కూడా ఒత్తిడికి లోనయ్యే విధంగా సమంత పాత్రను త్రివిక్రమ్ తీర్చిదిద్దారు.అజ్ఞాతవాసి సినిమాలో అను ఇమ్మన్యుయేల్ పాత్ర ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటుంది.త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన కొన్ని సినిమాలు మినహా దాదాపుగా ప్రతి సినిమాలో హీరోయిన్ పాత్రలు ఇదే విధంగా ఉండటం గమనార్హం.