జయమ్మ పంచాయతీ ఈవెంట్ లో నాని కామెంట్స్..!

స్మాల్ స్క్రీన్ స్టార్ యాంకర్ సుమ లీడ్ రోల్ లో విజయ్ కుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా జయమ్మ పంచాయతీ.మే 6న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరిగింది.

 Nani Comments Suma Jayamma Panchayathi Event Details, Jayamman Panchayati, Hero-TeluguStop.com

జయమ్మ పంచాయతీ ఈవెంట్ కి గెస్ట్ గా కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని వచ్చారు.ఈవెంట్ లో నాని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

దేవదాసు తర్వాత నాగార్జున సర్ ని కలవడం చాలా సంతోషంగా ఉందని అన్న నాని ఈవెంట్ లో క్యాస్టింగ్ ప్లేస్ లో సుమ.గెస్ట్ ప్లేస్ లో నేను ఉండటం కొత్తగా ఉందని అన్నారు.ఈరోజు నా సొంత ఫంక్షన్ ఉన్నా సరే ఈవెంట్ కి వచ్చే వాడినని అన్నారు నాని.సుమ గారు.మీరు.మీరు అని పిలిచి అలవాటైంది.

ఈ ఫార్మాలిటీస్ అన్ని పక్కన పెట్టి నా మనసుకి ఏదనిపిస్తే అది అనలాంటే అది సుమక్క అవుతుందని అన్నారు నాని.

నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను.

సుమ గారికి నేను చాలా పెద్ద అభిమానిని.ఇండస్ట్రీ పెద్దలు, అసోషియేషన్ లు, ప్రభుత్వాలు సినిమాకు ఏం చేశాయో నాకు తెలియదు కానీ సుమ గారు మాత్రం తెలుగు సినిమాకు చాలా చేశారు.

నాకు తెలిసి మేమందరం ఎప్పటికి ఆమెకు రుణపడి ఉంటాం అన్నారు నాని.ప్రతి సినిమాకు రిలీజ్ ముందు ఈవెంట్, ఇంటర్వ్యూస్ తో సుమ గారు ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆమె నవ్వులో ఒక పాజిటివ్ ఎనర్జీ.

ప్రతి ప్రాజెక్ట్ కి ఆమె తీసుకొచ్చె పాజిటివ్ ఎనర్జీ మాకెంతో అవసరమని అన్నారు.సుమ గారు నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు నాని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube