సెన్సేషనల్.. 1000 కోట్ల క్లబ్ లో కేజిఎఫ్ 2.. హిస్టారికల్ రికార్డ్..

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో అందరికి తెలుసు.కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 స్టార్ట్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచారు.

 Kgf Chapter 2 Cross The 1000 Crore Mark Worldwide, Yash, Kgf Chapter 2 , Prashan-TeluguStop.com

రెండేళ్ల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి.

ఈ నెల 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు, మన దగ్గర బెనిఫిట్ షో లు పడ్డాయి.

అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగి పోయింది.దీంతో ఇప్పుడు కేజిఎఫ్ మ్యానియా దేశాన్ని ఊపేస్తోంది అనే చెప్పాలి.

పార్ట్ 1 ను మించి సాలిడ్ ఎలిమెంట్స్ తో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది.

దీంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్నట్టు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.దీంతో ఈ ఏడాదిలో రెండవ 1000 కోట్ల సినిమాగా అలాగే మన ఇండియన్ సినిమా దగ్గర బాహుబలి 2, దంగల్ మరియు లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ సినిమా చేరాయి.

ఇక ఇప్పుడు ఏకైన కన్నడ సినిమాగా కేజిఎఫ్ చాప్టర్ 2 కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

Telugu Kgf Chapter, Kgfchapter, Prashant Neil, Yash-Movie

దీంతో కన్నడ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కేజిఎఫ్ 2 సినిమా ముందు నుండి కూడా భారీ అంచనాల తోనే వచ్చింది.ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా 10 వేల స్క్రీన్ లకు పైగానే రిలీజ్ చేసారు.

అన్ని చోట్ల కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube