సెన్సేషనల్.. 1000 కోట్ల క్లబ్ లో కేజిఎఫ్ 2.. హిస్టారికల్ రికార్డ్..

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో అందరికి తెలుసు.

కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 స్టార్ట్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచారు.

రెండేళ్ల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.

దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి.ఈ నెల 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు, మన దగ్గర బెనిఫిట్ షో లు పడ్డాయి.

అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగి పోయింది.

దీంతో ఇప్పుడు కేజిఎఫ్ మ్యానియా దేశాన్ని ఊపేస్తోంది అనే చెప్పాలి.పార్ట్ 1 ను మించి సాలిడ్ ఎలిమెంట్స్ తో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది.

దీంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్నట్టు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

దీంతో ఈ ఏడాదిలో రెండవ 1000 కోట్ల సినిమాగా అలాగే మన ఇండియన్ సినిమా దగ్గర బాహుబలి 2, దంగల్ మరియు లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ సినిమా చేరాయి.

ఇక ఇప్పుడు ఏకైన కన్నడ సినిమాగా కేజిఎఫ్ చాప్టర్ 2 కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

"""/" / దీంతో కన్నడ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కేజిఎఫ్ 2 సినిమా ముందు నుండి కూడా భారీ అంచనాల తోనే వచ్చింది.

ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా 10 వేల స్క్రీన్ లకు పైగానే రిలీజ్ చేసారు.

అన్ని చోట్ల కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!