రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉండడం ఆ పార్టీ నాయకుల్లో కంగారు పుట్టిస్తోంది.
ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్ల విషయంలో అప్పుడే పోటీ మొదలైపోయింది.ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల్లోని కీలక నాయకులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఒత్తిడి పెంచుతున్నారు గతంలో హామీ ఉంది నుంచి వచ్చి చేరిన వారు ప్రచారం చేసుకుంటూ రంగంలోకి దిగ బోపోతుండడం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన పెంచుతోంది.
దీంతో టికెట్ విషయంలో టిఆర్ఎస్ నాయకుల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి.
పెద్ద ఎత్తున నాయకులను ఎమ్మెల్యే టికెట్ హామీతో తీసుకురావడమే ఈ పరిస్థితి కి కారణం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ గ్రూపు రాజకీయాలు, టిక్కెట్ల పోటీ వాతావరణం నాయకుల మధ్య పెరిగిపోతుండటం టిఆర్ఎస్ అగ్రనాయకత్వం కి ఆందోళన కలిగిస్తోంది.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారిలో ఎవరికీ కేటాయించాలని విషయంలో ఇప్పటి నుంచే అధినేత కేసీఆర్ కు టెన్షన్ పుట్టిస్తోంది.తాండూరు నియోజకవర్గ వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఇక్కడ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ తనదేనని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ హడావుడి చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో స్వల్ప ఓటమి తో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి చేతిలో మహేందర్ రెడ్డి ఓటమి చెందారు.
![Telugu Cm Kcr, Parnammahendar, Protocol, Mlas, Telangana, Trs-Political Telugu Cm Kcr, Parnammahendar, Protocol, Mlas, Telangana, Trs-Political](https://telugustop.com/wp-content/uploads/2022/04/party-tickets-issue-between-trs-leaders-in-coming-assembly-elections-detailss.jpg)
ఆ తర్వాత పరిణామాల క్రమంలో రోహిత్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు.ఇక అప్పటి నుంచి మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది.ఇటీవల వీరి మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది.మహేందర్ రెడ్డి తాండూరు టౌన్ సిఐ ను వ్యక్తిగతంగానూ దూషించిన సంఘటన వైరల్ అయింది.ఈ వ్యవహారంపై మహేందర్ రెడ్డి పై కేసు నమోదు చేయాలంటూ రోహిత్ రెడ్డి వర్గీయులు ముందు ఆందోళనకు దిగారు.ఒకే పార్టీకి చెందిన నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆందోళన చేయించడం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆగ్రహం కలిగిస్తోంది.
ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలోనూ టికెట్ ఆశించే వారి మధ్య , టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల మధ్య నిత్యం వివాదాలు షరా మామూలు అయ్యాయి.