నాని హీరోగా తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా టీజర్ విడుదల కార్యక్రమం నేడు లాంఛనంగా జరిగింది.టీజర్ విడుదల కార్యక్రమంలో నాని లుక్ చాలా విభిన్నంగా ఉంది అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా చర్చించుకుంటున్నారు.
నానిని పొడవాటి జుట్టు మరియు గడ్డంతో చూడడం చాలా అరుదుగా జరుగుతుంది.తాజాగా ఆయన నటిస్తున్న దసరా అనే సినిమా కోసం ఇలా జుట్టు గడ్డం పెంచి ఉన్నాడు.
గతంలో చాలా క్లాస్ పాత్రలో కనిపించాడు.కానీ దసరా సినిమా కోసం ఆయన మాస్ పాత్ర చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది.
అందులో భాగంగానే ఇలా గడ్డం మరియు జుట్టు విపరీతంగా పెంచి కనిపించబోతున్నాడు.పెద్ద ఎత్తున ఆయన ఇలాంటి లుక్ లో కనిపించడంతో సోషల్ మీడియా లో కామెంట్స్ వస్తున్నాయి.
ఎక్కువ శాతం మంది పుష్ప సినిమా లో అల్లు అర్జున్ లా ఉన్నాడు అంటూ నాని ని కామెంట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలను చూస్తుంటే ఖచ్చితంగా ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాడు అనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాని గత చిత్రాల్లో చాలా క్లాస్ లుక్ లో కనిపించాడు.కానీ ఈ సినిమాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మాస్ మసాలా నచ్చే విధంగా నాని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభమైంది.త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.
అంటే సుందరానికి సినిమా జూన్ 10వ తారీఖు న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఆ సినిమా తర్వాత కనీసం మూడు నెలల గ్యాప్ తర్వాత అంటే ఇదే ఏడాదిలో నాని నటిస్తున్న దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
పుష్ప సినిమాలో మాదిరిగా నాని కనిపిస్తాడు కనుక ఈ సినిమా కూడా పుష్ప సినిమా రేంజ్ లో సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.