ఎమ్మెల్యే విడుదల రజీనీ మొదటి సారిగి మంత్రిగా బాధ్యతలు స్వేకరించారు.అయితే సామాజికవర్గ కూర్పులో భాగంగా రజినీకి మంత్రి పదవి దక్కినా.
ఇప్పుడు ఆమె సామాజికవర్గం విషయంలో వివాదం రాజుకుంటోంది.రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా సీఎం జగన్ నియమించిన సంగతి తెలిసిందే.
రజకుల కుటుంబానికి చెందిన ఆమెను సీఎం తన కేబినెట్ లో మంత్రిగా తీసుకోవడంపై ఆమె కూడా సంతోషం వ్యక్తం చేశారు.అయితే.
ఆమె చిలకలూరిపేట ఎమ్మెల్యేగా, స్థానికురాలిగా ఆమె సుపరిచితులు.అయితే.
ఆమె జన్మస్థలం మాత్రం తెలంగాణ జిల్లాలో అని తెలుస్తోంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం కొండాపురంలో ఆమె జన్మించారని.
అందుకే ఆమె మంత్రి కావడంతో స్థానికంగా సంబరాలు జరుపుకున్నారని తెలుస్తోంది.పుట్టినిల్లు తెలంగాణ ప్రాంతమే అయినా.చిలకలూరిపేటకు చెందిన విడదల కుమారస్వామిని వివాహమాడి స్థానికంగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు.40ఏళ్ల క్రితమే రజిని తల్లిదండ్రులు హైదరాబాద్ కు వలస వెళ్లారని అంటున్నారు.తెలంగాణ బిడ్డ ఏపీలో మంత్రి అయ్యారని వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే.ఏపీ ప్రాంతంలో పుట్టి తెలంగాణలో మంత్రి కావడం కష్టం.మరి తెలంగాణలో జన్మించిన వారికి ఏపీలో మంత్రి పదవి ఎలా ఇస్తారనే వాదనలూ లేకపోలేదు.

మరోవైపు.సామాజికవర్గ కూర్పులో భాగంగా రజినీకి మంత్రి పదవి దక్కినా.ఇప్పుడు ఆమె సామాజికవర్గం విషయంలో వివాదం రాజుకుంటోంది.రజినీ తమ సామాజికవర్గం కాదని కొన్ని రజక సంఘాలు ప్రకటిస్తున్నాయి.ఆమె ముదిరాజ్ సామాజికవర్గం అని అంటున్నాయి.ఉన్నత విద్యావంతురాలిగా.
సామాజికవర్గ సమీకరణాలతో చిన్న వయసులోనే మంత్రిగా.అదీ ఎంతో ప్రాధాన్యమున్న వైద్యశాఖకు మంత్రిగా ఆమె బాధ్యతలు తీసకోవడం విశేషం.

2019లో జగన్ వేవ్ లో ఆమె ఎమ్మెల్యేగా గెలిచినా ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది టీడీపీలోనే.2018లో విశాఖలో జరిగిన టీడీపీ మహానాడులో ప్రస్తుత సీఎం జగన్ పైనే ఆమె విమర్శలు చేశారు.అయితే.అనంతర పరిణామాలతో ఆమె వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.మొత్తంగా.ఆమె రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యేగా గెలుపు, ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం ఒకెత్తయితే.
ప్రస్తుతం ఆమెపై ప్రాంతీయ నేపథ్యం, సామాజికవర్గ ఆరోపణలు వస్తున్నాయి.వీటిని ఆమె ఎలా ఎదుర్కొంటారో.
ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.