కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 'ది ఘోస్ట్' కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభం

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దరకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’ పై భారీ అంచనాలు వున్నాయి.డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో హీరోలను మునుపెన్నడూ చూడని పాత్రల్లో ప్రజెంట్ చేయడంలో పేరుపొందిన ప్రవీణ్ సత్తారు, కింగ్ నాగార్జునని విభిన్నమైన పాత్రలో చూపించి ప్రేక్షకులని థ్రిల్ చేయడానికి వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 King Nagarjuna, Praveen Sattaru, Sree Venkateshwara Cinemas Llp, Northstar Enter-TeluguStop.com

చిత్ర యూనిట్ ఇటీవల దుబాయ్‌లో సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సోనాల్ చౌహాన్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ చిత్రంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైయింది .“ఊటీలో ఉదయాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి” అని ట్వీట్ చేస్తూ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఊటీ లొకేషన్ స్టిల్ ని అభిమానులతో పంచుకున్నారు.గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోహిస్తున్నారు.

శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube