ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటడంతో , దేశవ్యాప్తంగా బీజేపీ గాలి కి ఎదురే లేదు అనే విషయం స్పష్టం అయిపోయింది.ఇప్పటి వరకు బిజెపికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తున్న చాలా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి.
ముఖ్యంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో నడిచేందుకు సిద్ధమైన కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో వెనుకడుగు వేస్తున్న వ్యవహారాలపై ప్రశాంత్ కిషోర్ తాజాగా స్పందించారు.నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం పై స్పందించిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీ గారడి తో ఈసారి ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది అంటూ విమర్శలు చేశారు. ” ఎన్నికల గారడి” గురించి ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రశాంత్ కిషోర్ సూచించారు.దేశంలో అధికారం నిర్ణయించే ఎన్నికలు 2024లో జరగనున్నాయని, ఇప్పటి రాష్ట్ర ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం లేదని ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు.” భారత్ లో అధికార మార్పిడి కోసం 2024 లో ఎన్నికలు జరుగుతాయి.రాష్ట్ర ఎన్నికల ఫలితాలతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు జరగదని సాహెబ్ కు తెలుసు.
ప్రతిపక్షాల పై ప్రజా వ్యతిరేకత పై నిర్ణయాత్మక మానసిక ప్రయోజనాన్ని ఏర్పరచుకవడానికి రాష్ట్ర ఫలితాలను అద్దంలో చూపెడుతూ.ఈ తెలివైన ప్రయత్నం.ఈ గారడీ కి పడిపోకండి.తప్పుడు కథనంలో భాగం అవ్వకండి” అంటూ ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు.

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తూ ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహాలు ఇస్తూ ప్రాంతీయ పార్టీలను ప్రోత్సహిస్తున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమిళనాడు సీఎం తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వంటి వారితోనూ ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే చర్చించడంతో పాటు మూడో ప్రత్యామ్నాయం ఓటమిని దేశవ్యాప్తంగా హైలెట్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవుతున్న సమయంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ జెండా ఎగరడం తో ప్రాంతీయ పార్టీలు ఆలోచనలో పడ్డాయి ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించారు.