మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన రాజకీయ భవిష్యత్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని పలు గ్రామాలలో పొంగులేటి పర్యటించారు.
ఇటీవల కాలంలో మరణించిన వారి కుటుంబాలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆయన పరామర్శించి ఆర్ధిక సహాయాన్ని 0అందజేశారు.సూబ్లేడు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియాతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.
ప్రజలకు సేవ చేసేందుకు నాకు పదవితో పనిలేదని అన్నారు.పదవీ ఉన్న లేకున్నా ప్రజా సమస్యలను తీర్చుతూ ప్రజా క్షేత్రంలోనే ఉంటానని అన్నారు.
ఢిల్లీ నుంచి బీజేపి, కాంగ్రెస్ పార్టీల పెద్దలు నన్ను సంప్రదిస్తున్నారని తెలిపారు.ఎన్ని ముళ్ళు గుచ్చుకున్న గులాబీ తోటలోనే ప్రయణిస్థానని అన్నారు.
టీఆరెస్ పార్టీ ప్రజల తరపున నిలబడేందుకు తనకు అవకాశం కలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.లేని ఎడల ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల తీర్పును పొందడం ఖాయమని పొంగులేటి కుండబద్దలు కొట్టారు.
ఈకార్యక్రమంలో పొంగులేటి వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య, రామసహయం నరేష్ రెడ్డి, సర్పంచ్ పోలెపొంగు సంజీవయ్య, సుమన్,మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, కె.శ్రీనివాసరెడ్డి, ముద్దిరెడ్డి లచ్చిరెడ్డి,కర్నాటి రాజేంద్రప్రసాద్, అంబేద్కర్, సైఫుద్దీన్,ఉపేందర్, వెంకటేశ్వర్లు, ప్రవీణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.