ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సుడిగాలి సుధీర్.. రష్మీ ఫ్యాన్స్ కు షాక్.. అమ్మాయి ఎవరంటే?

బుల్లితెర రియాలిటీ షోల ద్వారా ఫేమస్ అయిన సుడిగాలి సుధీర్ రష్మీతో ప్రేమలో ఉన్నారని సుధీర్ రష్మీ పెళ్లి చేసుకుంటారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.సుధీర్ రష్మీ కలిసి చేసిన షోలకు మంచి రేటింగ్స్ వచ్చాయి.

 Sudigali Sudheer Engagement Photos Goes Viral In Social Media Details, Sudigali-TeluguStop.com

ఈటీవీ ఢీ షోకు రష్మీ సుధీర్ దూరమైన తర్వాత రేటింగ్స్ తగ్గాయనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా సుడిగాలి సుధీర్ కు గ్రాండ్ గా ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో సుడిగాలి సుధీర్ ఒకరనే సంగతి తెలిసిందే.సుడిగాలి సుధీర్ ఎంగేజ్‌మెంట్‌ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.అయితే ఒక కామెడీ షోలో సుధీర్ ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంతో ఈ ఎంగేజ్‌మెంట్‌ నిజమా? కాదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.సుడిగాలి సుధీర్ అభిమానుల మధ్య ఈ ఫోటోల గురించి జోరుగా చర్చ జరుగుతోంది.

Telugu Anchor Rashmi, Jabardasth, Sudheer Pics-Movie

అయితే సుడిగాలి సుధీర్ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్టు చెబుతున్న అమ్మాయి ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని అమ్మాయి కావడం సుడిగాలి సుధీర్ వయస్సు 34 సంవత్సరాలు కావడంతో కొందరు ఈ ఎంగేజ్‌మెంట్‌ నిజం కావచ్చని భావిస్తున్నారు.గతంలో స్కిట్ లో భాగంగా సుడిగాలి సుధీర్, రష్మీ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.సుధీర్ ఎంగేజ్‌మెంట్‌ గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Telugu Anchor Rashmi, Jabardasth, Sudheer Pics-Movie

అయితే వైరల్ అవుతున్న ఫోటోల వల్ల రష్మీ అభిమానులు మాత్రం షాకవుతున్నారు.సుధీర్ రష్మీ జోడీకి క్రమంగా ఈటీవీ ఛానల్ లో ప్రాధన్యత తగ్గుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సుధీర్ కు నిజంగా పెళ్లి జరిగితే మాత్రం సుధీర్ రష్మీ జోడీ భవిష్యత్తులో బుల్లితెరపై కనిపించకపోవచ్చు.

కొన్నిరోజుల క్రితం యాంకర్ రష్మీకి పెళ్లైందని వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఆ వార్తలపై స్పందించడానికి రష్మీ ఇష్టపడలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube