బాలకృష్ణ వసుంధరల పెళ్లి పత్రికను మీరు చూశారా.. పెళ్లి ఎక్కడ జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరైన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ లుక్ లో కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన పోస్టర్ల ద్వారా క్లారిటీ వచ్చింది.

 Balakrishna Vasundhara Devi Wedding Invitation Goes Viral In Social Media , Bal-TeluguStop.com

ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన శృతిహాసన్ కరోనా బారిన పడటంతో ప్రస్తుతం బాలకృష్ణపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటం గమనార్హం.

అయితే స్టార్ హీరో బాలకృష్ణ వసుంధరల పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.నందమూరి అభిమానులు ఈ పెళ్లి పత్రికను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.1982 సంవత్సరం డిసెంబర్ నెల 8వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాలకు బాలయ్య వసుంధరల వివాహం జరిగింది.

Telugu Balakrishna, Shrutihasan, Tollywood, Vasundhara Devi-Movie

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కర్ణాటక కళ్యాణ మండపం నందు బాలయ్య వసుంధరల పెళ్లి జరగడం గమనార్హం.బాలయ్య భార్య వసుంధర పేరు పెళ్లి పత్రికలో వసుంధరా దేవిగా పేర్కొనగా ఈమె దేవులపల్లి సూర్యారావు, దేవులపల్లి ప్రమీలా రాణి దంపతుల కూతురు కావడం గమనార్హం.బాలయ్య వసుంధర వివాహం జరిగి 40 సంవత్సరాలైంది.

వీళ్లిద్దరూ అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.

బాలయ్య భార్య వసుంధర మీడియాకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

బాలయ్య వసుంధర దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు కాగా ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా కొడుకు మోక్షజ్ఞ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.మోక్షజ్ఞ తొలి సినిమాకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

ఇతర స్టార్ హీరోల కొడుకులు ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో బాలయ్య కూడా మోక్షజ్ఞను సినిమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube