ఉక్రెయిన్ : భారత ఎంబసీ మరో కీలక సూచన...ఇంతలోనే ఏం జరిగింది...??

ఉక్రెయిన్ – రష్యాల మధ్య యుద్ధం నేడు మూడో రోజుకు చేరుకుంది.రష్యా యుద్ద విమానాలు, ట్యాంకర్లు ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి.

 Ukraine: Another Key Indication From The Indian Embassy What Happened In The Me-TeluguStop.com

ఉక్రెయిన్ సైనికులు వీరోచితంగా పోరాడుతున్నా రష్యా బలమైన సైనిక బలం ముందు ఓటమి చెందక తప్పదని, అమెరికా తమ సైన్యాన్ని రంగంలోకి దించితే తప్ప ఉక్రెయిన్ ఈ సంక్షోభం నుంచీ బయటపడదని నిపుణులు అంటున్నారు.మరో పక్క రష్యా ఇప్పటి వరకూ సుమారు 3500 మందిని కోల్పోయిందని తెలుస్తోంది.

కాగా ఉక్రెయిన్ వ్యాప్తంగా ప్రస్తుతం 16 వేల మంది భారతీయులు ఉన్నారని వారందరూ భారత ఎంబసీ సాయంతో అలాగే కొన్ని స్వచ్చంద సంస్థల సాయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారని తెలుస్తోంది.

అయితే నిన్నటి రోజున కివ్ లోని భారత ఎంబసీ ఓ ప్రకటన చేసింది.

ఉక్రెయిన్ లో భారతీయులు ఎవరైనా సరే సరిహద్దు ప్రాంతాలకు వస్తే అక్కడి నుంచీ వేరే దేశానికి తరలించి అక్కడి నుంచీ భారత్ పంపుతామని అయితే వాహనాలలో వచ్చే వారు మాత్రం తప్పకుండా భారత పతాకం వాహనాలపై కనపడేట్టు ఉంచి రావాలని సూచించింది.సరిహద్దుకు వచ్చిన వారిని అక్కడే ఉండే భారతీయ బృందాలు సురక్షితంగా వారిని గమ్యాలకు చేర్చుతారని ఎంబసీ ప్రకటించింది…ఈ ప్రకటన చేసిన 24 గంటలలో మరో కీలక ప్రకటన చేసింది ఎంబసీ.

సరిహద్దుల వద్ద భారత ప్రభుత్వ అధికారులు ఉన్నారని అయితే వారితో ముందస్తుగా సంప్రదింపులు లేకుండా ఎవరూ సరిహద్దులకు వెళ్ళవద్దని ఎంబసీ కీలక ప్రకటన చేసింది.ప్రస్తుతానికి సరిహద్దుల వద్ద పరిస్థితులు అనుకూలంగా లేవని ఎంబసీకి ముందస్తు సమాచారం ఇచ్చిన వారు మాత్రమే సరిహద్దులకు రావాలని తాము పొరుగు దేశాల భారత్ ఎంబసీలతో సౌకర్యాల కోసం సంప్రదింపులు చేస్తున్నామని సమాచారం లేకుండా రావడం వలన తమకు సాయం చేయడం ఎంతో కష్టంగా ఉంటుందని సూచించింది.సరిహద్దులకు వచ్చే అవకాసం లేనివారు సురక్షిత ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలని, ప్రస్తుతం ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావడం భాధకరమని ఎంబసీ తన ప్రకటనలో తెలిపింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube