ఇండస్ట్రీలో టికెట్ల రేట్లు పెద్ద సమస్య కాదు... జనాలను దోపిడీ చేస్తారా: తమ్మారెడ్డి భరద్వాజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల నుంచి సినిమా టికెట్ల రేట్లు పూర్తిగా తగ్గించడంతో భారీ బడ్జెట్ చిత్రాలు పూర్తిగా నష్ట పోతాయని ఎలాగైనా సినిమా టిక్కెట్ల రేట్లను పెంచమని ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సినీ పెద్దలు పలుమార్లు కలిసి ఆయనకు ఇండస్ట్రీ సమస్యను వివరించారు.అయితే సినీ సెలబ్రిటీలు ముఖ్యమంత్రిని కలవడం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్.

 Ticket Rates Are Not A Big Issue In The Industry Plan To Robbery The People By T-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఇండస్ట్రీలో ఉన్న సమస్య గురించి యాంకర్ తనని ప్రశ్నించగా అందుకు సమాధానం చెబుతున్న తమ్మారెడ్డి అసలు ఇండస్ట్రీలో సమస్య లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.

ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు లేవు కానీ ముఖ్యమంత్రి దగ్గరికి వీరందరూ వారి వ్యక్తిగత సమస్యల వల్ల వెళ్లి ఉంటారని తను అభిప్రాయ పడుతున్నట్లు తెలియజేశారు.అసలు సినిమా టికెట్లు రేట్లు సమస్య ఇండస్ట్రీలో ఏ మాత్రం లేదని ఆయన అభిప్రాయం వెల్లడించారు.

సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల భారీ బడ్జెట్ సినిమాలు ఇబ్బందులను ఎదుర్కొంటారు కదా అన్న ప్రశ్న ఎదురవడంతో… భారీ బడ్జెట్ సినిమా తక్కువ టికెట్ రేట్లు ఉన్నప్పటికీ ఏకంగా ఆ సినిమాలను రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లు వారి సొంతం చేసుకొని సినిమాను విడుదల చేస్తారు.అలాంటప్పుడు వారికి కలెక్షన్లు కూడా బాగా వస్తాయి ఇక సమస్య ఏముందనీ ఆయన ప్రశ్నించారు.ఒక అఖండ సినిమా, బంగార్రాజు, డీజే టిల్లు వంటి సినిమాలకు లేని సమస్య ఈ సినిమాలకు ఎందుకు వస్తుంది.సినిమా టికెట్ల రేట్లను పెంచి ఊర్లో ఉన్న అన్ని థియేటర్లలో ఆ సినిమాలను విడుదల చేసి జనాలను దోపిడీ చేయాలనుకుంటున్నారా అంటూ తమ్మారెడ్డి తనదైనశైలిలో ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube